/rtv/media/media_files/2025/05/24/m9GWUj0TRTJFTxgFtfzQ.jpg)
427 Rohingya May Have Drowned In Two Shipwrecks In May, Says United Nations
మయన్మార్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్కడి తీరంలో రెండు ఓడలు మునిగిపోయాయి. ఈ ఘటనలో 427 మంది రోహింగ్యాలు మృతి చెందినట్లు తెలుస్తోంది. మే 9,10వ తేదీల్లో ఈ ఘోర ప్రమాదాలు జరిగాయని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఇది నిర్ధరణ అయితే సముద్రంలో జరిగిన అత్యంత విషాద ఘటనగా ఇది నిలిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.
Also Read: వణుకు పుట్టించే వీడియో..!! పడుకున్న వ్యక్తి పక్కలో దూరిన భారీ నాగుపాము.. (Viral Video)
అయితే ఈ ఓడల ప్రమాదానికి గల కారణాలను ఐరాస అనుబంధ శరణార్థి విభాగం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తొలి ప్రమాదం మే 9న జరగగా అందులో 267 మందిలో 66 మంది ప్రాణాలతో బయటపడ్డట్లు ప్రాథమికంగా తెలిపింది. ఇక మే 10న రెండో ఓడ ప్రమాదానికి గురయ్యింది. ఇందులో 21 మంది మాత్రమే బతికి బయటపడినట్లు తెలుస్తోంది. ఈ రెండు ప్రమాదాల్లో మొత్తం 472 మంది రోహింగ్యాలు మృతి చెందినట్లు సమాచారం.
Also Read: ఆపరేషన్ సింధూర్ లో 200 మందికి పైగా ఉగ్రవాదులు మృతి..న్యూ అప్డేట్స్ అవుట్
రోహింగ్యాలు మయన్మార్‌లో నివసిస్తుంటారన్న సంగతి తెలిసిందే. కానీ అక్కడి సైనికులు గతంలో మారణహోమం సృష్టించారు. దీంతో వాళ్ల నుంచి తప్పించుకునేందుకు 2017లో లక్షలాది మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్‌కు తరలివెళ్లిపోయారు. 2024లో సైనిక తిరుగుబాటు తర్వాత మయన్మార్‌లో మరింత వలసలు పెరిగాయి. దీంతో దక్షిణ బంగ్లాదేశ్‌లోని శరణార్థులతో శిబిరాలు నిండిపోయాయి. అక్కడ కూడా పరిస్థితులు క్షీణించడంతో వాళ్లందరూ ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఇందుకోసం ప్రమాదకరంగా ఉండే సముద్ర మార్గాలను ఎంచుకుంటున్నారు.
Also Read: దండకారణ్యంలో భీకర యుద్ధం.. అగ్రనేతలను చుట్టుముట్టిన 15వేల భద్రతా బలగాలు!
Also read: 43 ఏళ్లు జైల్లోనే.. నిర్దోషిగా విడుదలైన 104 ఏళ్ల వృద్ధుడు
rtv-news | international | accident