Trump-Musk:డోజ్‌ నుంచి మస్క్‌ ఔట్‌..!

డోజ్‌కు సంబంధించి ట్రంప్‌ నుంచి కీలక విషయం బయటకు వచ్చింది. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఎలాన్‌ మస్క్‌ అతి త్వరలోనే ఆ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తుంది.ఈ విషయం గురించి ట్రంప్‌ కేబినెట్‌ కు తెలియజేశారు.

New Update
trump musk

musk trump Photograph: (trump)

డోజ్‌కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నుంచి కీలక విషయం బయటకు వచ్చింది. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఎలాన్‌ మస్క్‌ అతి త్వరలోనే ఆ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తుంది. మే చివరి లేదా జూన్‌ మొదటి వారంలో మస్క్‌ ఆ బాధ్యతల నుంచి వైదొలిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Also Read: Forbes Billionaires List: 2025లో ప్రపంచ కుబేరులు వీరే.. టాప్ 10 నుంచి మాయమైన ముఖేష్ అంబానీ

ఈ విషయాన్ని ట్రంప్‌ తనకు అత్యంత సన్నిహితులైన ఓ ముగ్గురితో పాటు కేబినెట్‌ కు కూడా తెలియజేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.

Also Read: Loan waiver: లివర్ రూ.90 వేలు, కిడ్నీ రూ.75వేలు.. అప్పు తీర్చలేక అవయవాలు అమ్మకోడానికి రైతు

ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ విభాగానికి మస్క్‌ ను సారథిగా నియమించారు.ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు,శాఖల్లో వృథా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ఇది పని చేస్తుందని చెప్పిన ట్రంప్‌..ఆ విధంగానే వివిధ శాఖల్లో వేలాది మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియను చేపట్టారు.

ఈ క్రమంలో మస్క్‌ తీరు పైవిమర్శలు ఎదురవుతున్నాయి.ట్రంప్‌ యంత్రాంగాన్ని ఎలాన్‌ మస్క్‌ వెనకుండి నడిపిస్తున్నారనే ఆరపణలు వెల్లువెత్తాయి. దీంతో డోజ్‌ ల మస్క్‌ ఉద్యోగి కాదని, ఆయనకు ఎటువంటి నిర్ణయాధికారాలూ లేవని వైట్‌ హౌస్‌ క్లారిటీ ఇచ్చింది.

ట్రంప్‌ సలహాదారుడిగా మాత్రమే మస్క్‌ ఆ బాధ్యతలు చూస్తున్నారని వెల్లడించిన సంగతి తెలిసిందే.

Also Read: Cabinet expansion : కొత్త మంత్రుల లిస్టుపై ట్విస్ట్‌...ఆయనకు పదవిపై రాహుల్‌ అభ్యంతరం

Also Read: Duvvada Srinivas-Madhuri: త్వరలోనే దువ్వాడ శ్రీనివాస్-మాధురి పెళ్లి.. వేణు స్వామి చేతుల మీదుగా.. ఫొటోలు వైరల్!

white-house | employees | layoffs | jobs | tesla | elon-musk | musk | doze | america | trump | america cabinate | cabinate | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు