Telangana: మెడికోలకు అదిరిపోయే శుభవార్త.. భారీగా వేతనం పెంపు!
తెలంగాణలో మెడికల్, డెంటల్ విద్యార్థుల స్టైఫండ్ను 15 శాతం పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు ఇచ్చే గౌరవ వేతనానికి కూడా వర్తిస్తుంది. ఈ పెంపు వల్ల ఇంటర్న్లకు నెలకు రూ.29,792 స్టైఫండ్ లభించనుంది.