/rtv/media/media_files/2025/06/11/TVUQP2qqUGItn6CIWvzY.jpg)
Trump On National guards deploye
నేషనల్ గార్డ్స్, మెరైన్ లను రంగంలోకి దింపడం విషయంలో అమెరికా అధ్యక్షుడు తనను తాను బాగా సమర్ధించుకున్నారు. అల్లర్లను అణచివేసేందుకు నేషనల్ గార్డులను పంపించడాన్ని ఆయన సమర్థించుకున్నారు. ఒకవేళ మెరైన్స్‌తోపాటు ఇతర సైనిక బలగాలను పంపించకుంటే ఆ నగరం కాలి బూడిదైపోయేదన్నారు. లాస్ ఏంజెలెస్ అందమైన నగరం...అది లేకుండా పోయేది అని ట్రంప్ అన్నారు. లాస్ ఏంజెలస్ గవర్నర్ న్యూసమ్, మేయర్ల అసమర్థత వల్లనే ప్రస్తుత పరిస్థితులు ఏర్పడ్డాయని ట్రంప్ ఆరోపించారు. అందుకే ఆందోళనలను, నిరసనలను అణిచివేయడానికి తాము యాక్షన్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఆ క్రమంలోనే 4వేల మంది నేషనల్ గార్డ్స్, 700 మంది మెరైన్ లను పంపించామని ఆయన సమర్ధించుకున్నారు.
Also Read : కేసీఆర్ ఫౌంహౌస్‌లో జారిపడ్డ MLA.. తీవ్ర గాయాలు
Trump claims deploying national guard saved LA
— RT (@RT_com) June 10, 2025
'If I didn’t 'SEND IN THE TROOPS' to LA, that once beautiful and great City would be burning to the ground right now'
'Much like 25,000 houses burned to the ground in LA do to an incompetent Governor and Mayor' — he doubled down pic.twitter.com/R03fAwcK9M
Also Read : ఆందోళనలకు కేరాఫ్ అడ్రస్ లాస్ ఏంజెలెస్ ..గతంలోనూ గొడవలు..
'If we didn’t send in the National Guard quickly, LA would be burning to the ground.'
— GB News (@GBNEWS) June 10, 2025
President Trump says LA was 'under siege' and police 'unable to handle it' before federal troops intervened. pic.twitter.com/JF7PAm5F86
Also Read : లేఖ తర్వాత ఫస్ట్ టైం KCR ఫామ్‌హౌస్‌కు వెళ్లిన కవిత
JUST IN - President Trump: "If I didn’t 'SEND IN THE TROOPS' to Los Angeles the last three nights, that once beautiful and great City would be burning to the ground right now.." pic.twitter.com/jO2pakYD2j
— Insider Paper (@TheInsiderPaper) June 10, 2025
Also Read : తెలంగాణలో 12 చోట్ల ACB దాడులు.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో పని చేసిన ఇంజనీర్ ఇంటిపై రైడ్స్
చాలా బాగా పని చేశారు..
పైగా నేషనల్ గార్డ్స్ అద్భుతంగా పని చేశారని అధ్యక్షుడు ట్రంప్ చెప్పుకొచ్చారు. అల్లర్లను వారు అణిచివేశారని అన్నారు. అధ్యక్షుడు ట్రంప్‌పై కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన చర్యలు నియంతృత్వ పోకడలకు గుర్తుచేస్తున్నాయన్నారు. అమెరికా అధ్యక్షుడిపై దావా వేయనున్నట్లు చెప్పారు.
మరోవైపు అమెరికాలోని లాసం ఏంజెలెస్ లో నిరసనకారులు రెచ్చిపోతున్నారు. తాజాగా నగరంలోని యాపిల్ స్టోర్ లోకి దూరి ల్యాప్ టాప్స్, ఐపాడ్స్, ఫోన్లను ఎత్తుకెళ్ళారు. ముఖాలు కనించకుండా మాస్కులు, బ్లాక్ హుడీస్ వేసుకుని మరీ చోరీ చేశారు. తర్వాత షోరూమ్ అద్దాలను రాళ్ళతో పగులగొట్టారు.
Apple Store in Los Angeles got rapidly ransacked by the usual suspects during Monday night’s insane anti-ICE riot.
— Paul A. Szypula 🇺🇸 (@Bubblebathgirl) June 10, 2025
Mayor Karen Bass has absolutely no control of her constituents.
Yet another epic failure by LA’s worst ever mayor.pic.twitter.com/TkFNUb8tIV
usa | today-latest-news-in-telugu | america president donald trump | National Guards | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | international news in telugu