/rtv/media/media_files/2025/06/11/Xqgq9GEzS1pmTOcArWgy.jpg)
ICE Protest In LA
అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో అక్రమ వలసదారులపై అణిచివేతకు వ్యతిరేకంగా 5 రోజులుగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు నగరంలోని అనేక రోడ్లకు నిప్పు పెట్టారు, వాహనాలను తగులబెట్టారు. చాలా మంది నిరసనకారులు మెక్సికో జెండాను పట్టుకుని బయటకు వచ్చారు. పరిస్థితిని నియంత్రించడానికి, యుఎస్ నేషనల్ గార్డ్స్ నిరసనకారులపై టియర్ గ్యాస్ షెల్స్, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. ఫెడరల్ అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీలు అక్కడ ఉద్రిక్తతలకు దారి తీశాయి. తనీఖీలను అడ్డుకోవడానికి స్థానికులు ప్రయత్నించారు. వందల మంది ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు వరుసగా 4 వేల మంది నేషనల్ గార్డ్స్ ను, 700 మెరైన్ లను రంగంలోకి దింపారు. ప్రస్తుతం లాస్ ఏంజెలెస్ రణరంగంగా ఉంది. ఇక్కడ నిరసనలు మిగతా రాష్ట్రాలకు పాకుతున్నాయి.
Also Read : భయపెడుతున్న కరోనా భూతం.. ప్రధాని కేబినెట్ మీటింగ్ హాజరుకూ పరీక్షలు తప్పనిసరి
Also Read : నా రాజకీయ ప్రయాణం ఇదే.. రాజగోపాల్ రెడ్డి సంచలన ప్రకటన!
ఆందోళనలకు కేరాఫ్ అడ్రస్..
అయితే లాస్ ఏంజెలెస్ నగరానికి ఇదేమీ కొత్త కాదని చెబుతున్నారు. గతంలోనూ ఇక్కడ తీవ్ర నిరసనలు చెలరేగాయని చెబుతున్నారు. 1968లో ఇక్కడ తూర్పు ప్రాంతంలో 15వేల మంది విద్యార్థులు తరగతులను బహిష్కరించి ఆందోళనలకు దిగారు. తమను చిన్న చూపు చూస్తూ తెల్లవారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని మెక్సికన్ అమెరికన్ విద్యార్థులు నిరసనలు చేశారు. పాఠ్యాంశాలను మార్చాలని, ద్విభాషా విద్యను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన షికానో పౌర హక్కుల ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది. దీని తరువాత 1992లో రాడ్నీ కింగ్ నిరసన లాస్ ఏంజెలెస్ లో అతి పెద్ద ఆందోళనగా అభివర్ణిస్తారు. ఇది చరిత్రలో నిలిచిపోయింది. ఆఫ్రో అమెరికన్ మోటారిస్ట్ రాడ్నీ కింగ్‌ను హింసించిన నలుగురు శ్వేతజాతి అధికారులను నిర్దోషులుగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళనలకు దిగారు. వారంపాటు జరిగిన హింసాత్మక ఆందోళనల్లో 50 మంది చనిపోగా.. 2,000 మంది గాయపడ్డారు. ఈ గొడవల్లో అప్పటి అధ్యక్షుడు జార్జి బుష్ కూడా వేల మంది నేషనల్ గార్డ్స్, ఆర్మీ, మెరైన్ లను లాస్ ఏంజెలెస్ లో మోహరించారు.
ఇక 2020లో జార్జ్ ఫ్లాయిడ్ హత్యను నిరసిస్తూ యూఎస్ లో దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. అందులో లాస్ ఏంజెలెస్ లో అత్యంత ఎక్కువగా గొడవలు అయ్యాయి, నగరం అట్టుడికింది. బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్ పేరుతో జరిగిన ఈ ఆందోళనలకు ఈ నగరం కేంద్ర స్థానంగా నిలిచింది.
Also Read : ఫుల్ ఎంటర్ టైనింగ్ గా 'సితారే జమీన్ పర్' తెలుగు ట్రైలర్.. మీరు చూశారా?
Also Read : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్!
Also Read: Space X: స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక AXIOM-4 ప్రయెగం మళ్లీ వాయిదా
los-angeles | today-latest-news-in-telugu | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu