/rtv/media/media_files/2024/12/08/yxHEygWTftT7cVJAsa9F.jpg)
Volodymyr Zelenskyy
ఈస్టర్ సందర్భంగా తాత్కాలిక కాల్పుల విరమరణ పాటిస్తామని ప్రకటించిన రష్యా ఆ మాటకు కట్టుబడి లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపించారు.ఈస్టర్ కాల్పుల విరమణను గౌరవిస్తున్నట్లు తప్పుడు వైఖరిని ఆ దేశం ప్రదర్శిస్తోందన్నారు. ఎప్పటి లాగే తమ పై దాడులు కొనసాగించిందని..పదుల కొద్ది డ్రోన్,బాంబు దాడుల ఘటనలు నమోదయ్యాయని తెలిపారు.
మరో వైపు ..కీవ్ బలగాలూ దాడులు కొనసాగిస్తున్నట్లు రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ లోని అధికారులు ఆరోపించారు.''తాత్కాలిక కాల్పుల విరమణను గౌరవిస్తున్నటు రష్యా సైన్యం చెబుతోంది.కానీ ,యుద్ధ క్షేత్రంలో పైచేయి సాధించే, మా దేశానికి నష్టం కలిగించే ఏ అవకాశాన్నీ జారవిడుచుకోవడం లేదు. సుమారు 50కి పైగా బాంబు దాడులు,పదుల కొద్ది డ్రోన్ దాడులకు పాల్పడింది.
ఉదయం10 గంటల నుంచి తీవ్రత మరింత పెరిగింఇ.అయితే వైమానిక దాడులకు సంబంధించి సైరన్ లు మోగకపోవడం కాస్త ఉపశమనం కలిగించే అంశం. క్షేత్రస్థాయి పరిస్థితులు పరిశీలిస్తుంటే..పుతిన్ కు తన సైన్యం పై పూర్తి నియంత్రణ లేదని..లేదా,యుద్ధాన్ని ముగించే ఉద్దేశం ఆ దేశానికి లేదనేది స్పష్టమవుతోంది అని జెలెన్ స్కీ ట్వీట్లు చేశారు.
కాల్పుల విరమణ షరతులకు పూర్తిగా కట్టుబడి ఉండాలని మాస్కోను డిమాండ్ చేశారు. ఆదివారం అర్థరాత్రి నుంచి 30 రోజుల పాటు కాల్పుల విరమణను పొడిగించాలనే ప్రతిపాదనను పునరుద్ఘాటించారు. ఇదిలా ఉండగా..రష్యా,ఉక్రెయిన్ ల మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా క్రిమియా పై మాస్కో నియంత్రణను గుర్తించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ శాంతి ప్రతిపాదన వల్ల రెండు దేశాల మధ్య తక్షణ కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇందులో భాగంగా రూపొందించిన ఫ్రేమ్ వర్క్ ను ఉక్రెయిన్, ఐరోపా యంత్రాంగాలు పారిస్ లో పరిశీలించాయి. క్రిమియా పై రష్యా నియంత్రణ కొనసాగడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుకూలంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ..కష్టమైనా చర్చలకు సిద్ధంగా ఉన్నామని రష్యా ప్రకటించింది.
zelensky | ukraine-zelenskyy | zelensky vs putin | putin vs zelensky | zelenskyy | gaza | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates | international-news | international news in telugu | international news telugu | latest-international-news