/rtv/media/media_files/2025/04/19/oOg6upeKz2yufHGlUFYk.jpg)
nims fire Photograph: (nims fire)
Nims fire Accident : హైదరాబాద్ లోని నిమ్స్ లో ఇటీవల అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అగ్నిప్రమాదం వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదంపై జరిగిన విచారణ సందర్భంగా పలు కీలక విషయాలు బయటపడ్డాయి. సిగరెట్, చెత్త వల్లనే అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. శనివారం నాడు అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని గంటలోనే అగ్నిప్రమాదాన్ని కంట్రోల్‌లోకి తీసుకువచ్చారు. పొగ కంట్రోల్‌కి వచ్చాక అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలపై పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: BIG BREAKING: తిరుమలలో అగ్ని ప్రమాదం!
పోలీసుల విచారణలో లిఫ్ట్ పక్కన ఉన్న చెత్త, కాల్చి పడేసిన బీడీ, సిగరెట్ వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు గుర్తించారు. కేర్ లెస్ స్మోక్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఐదో అంతస్తులో ఖాళీగా ఉన్న స్థలంలో కొంతమంది సిబ్బంది చెత్తను వేయడంతోపాటు సిగరెట్ తాగి అక్కడే పడేశారు. ఈ సమయంలో అక్కడ ఉన్న బీడీ ముక్కలు లేదా సిగరెట్ నుంచి నిప్పు పడడంతో చెత్తలో మంటలు చెలరేగాయి. అది ఆపై విద్యుత్ వైర్లకు అంటుకుని మంటలు వ్యాపించినట్లు పోలీసులు ధృవీకరించారు.
Also Read: సీఎంకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ షాక్.. మర్యాదగా మాట్లాడలేనంటూ ఒమర్ అబ్దుల్లా ఫైర్!
నిర్లక్షంగా సిగరెట్ వాడడటమే ఈ ప్రమాదానికి దారితీసిందని వారు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. నిమ్స్ ఆరోగ్యశ్రీ విభాగానికి చెందిన కొంతమంది సిబ్బంది అక్రమంగా బాణాసంచా నిల్వ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఈ విషయంపై అధికారికంగా ఫిర్యాదు చేశారు.
Also Read: ‘టీం శివంగి’.. రాష్ట్రంలో తొలిసారి రంగంలోకి మహిళా కమాండోల బృందం!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఆధారంగా పోలీసులు మరో కేసును నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ కేసుపై పంజాగుట్ట పోలీసులు మల్టీ యాంగిల్ దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదం వెనుక ఉన్న కారణాలపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.
Also Read: తెలంగాణ రేషన్ షాపుల్లో ప్లాస్టిక్ రైస్ పంపిణీ? ఉడికించి వీడియో పోస్ట్ చేసిన లబ్దిదారుడు!