/rtv/media/media_files/2025/04/20/z87Cwq8hEMqrf6ZHm5KV.jpg)
OpenAI
OpenAI తాజాగా రెండు కొత్త మోడల్స్‌ను- o3, o4-mini- తన o-సిరీస్‌లో భాగంగా విడుదల చేసింది. ఈ మోడల్స్ ప్రధానంగా లోతైన ఆలోచనలతో స్పందించడానికి రూపొందించారు.
OpenAI ప్రకారం, ఇవి ఇప్పటివరకు విడుదల చేసిన అత్యంత తెలివైన మోడల్స్. కొత్తగా, ఈ మోడల్స్ ChatGPT లోని అన్ని టూల్స్‌ను కలిపి ఉపయోగించగలవు- ఇది వెబ్ సెర్చ్ చేయడం, యూజర్ అప్‌లోడ్ చేసిన ఫైళ్లను Python ద్వారా విశ్లేషించడం, విజువల్ కంటెంట్‌ను అర్థం చేసుకోవడం, ఇమేజులు తయారుచేయడం లాంటివి ఏకకాలంలో నిర్వహించగలవు.
Also Read: xAI గ్రోక్‌కి చాట్‌జీపీటీ తరహా మెమరీ ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే..?
o3 మోడల్ ప్రోగ్రామింగ్, గణితం, సైన్స్, విజువల్ ఎనాలసిస్ లాంటి సాంకేతిక రంగాల్లో అద్భుతంగా పనిచేస్తుంది. క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో ఇది మరింత సమర్థంగా ఉంటుంది. చిత్రాలు, గ్రాఫ్‌లు, చార్ట్‌లు లాంటి విజువల్ డేటాను కూడా ఈ మోడల్ అర్థం చేసుకుని విశ్లేషించగలదు.
ఇక o4-mini మోడల్ చిన్నదైనా వేగంగా స్పందించేందుకు, తక్కువ ఖర్చుతో Reasoning చేయడానికి రూపొందించబడింది. ఇది కూడా గణితం, కోడింగ్, విజువల్ టాస్క్‌లలో మెరుగైన పనితీరును చూపుతుంది.
Also Read: అరేయ్ ఏంట్రా ఇది.. సడన్‌గా చూసి నిజం అనుకున్నాం కదరా బాబు..
బ్రెయిన్‌లా ఆలోచించే OpenAI
ఈ రెండు మోడల్స్ కూడా తమ మునుపటి వెర్షన్లతో పోల్చితే, మరింత సమర్ధవంతంగా సమాధానాలను ఇస్తాయి. సమాధానాలు కూడా మరింత సహజంగా, మనిషి లాంటి అనుభూతిని కలిగించేలాగా రూపందించారు.
Also Read: ఫ్యాన్స్ మీట్‌లో షాకింగ్ డెసిషన్ బయటపెట్టిన సూర్య..
ChatGPT Plus, Pro, Team యూజర్లకు అందుబాటులో ఉన్న ఈ o3, o4-mini, o4-mini-high మోడల్స్ లోని o4-mini మోడల్‌ను ఉచిత యూజర్లు కూడా ఉపయోగించవచ్చు- ‘Think’ అనే ఆప్షన్‌ను చాట్ కంపోజర్‌లో ఎంచుకోవడం ద్వారా యాక్సెస్ చేయవచ్చు.