/rtv/media/media_files/2025/04/20/5wAplDwsNHlkiReXgH4p.jpg)
Drunk Woman Spotted Causing Disturbance On Haridwar Highway
మద్యం మత్తులో ఓ యువతి నడి రోడ్డుపై హల్ చల్ చేసింది. ఎదురుగా వస్తున్న కార్లు, బైక్‌లను ఆపి రచ్చ రచ్చ చేసింది. ఆటోలలోకి దూరి హంగామా సృష్టించింది. అడ్డుకున్న వారిపై చిర్రెత్తిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆ వీడియోలో యువతి చేసిన చేష్టలకు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: “ఓదెల 2” ఫస్ట్ డే కలెక్షన్స్ తుస్.. విజువల్స్ ఎక్కువ విషయం తక్కువ..!
మద్యం మత్తులో యువతి రచ్చ
ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగింది. పవిత్ర స్థలం హర్ కీ పౌరి సమీపంలోని రోడిబెల్‌వాలా చౌకీ సమీపంలో ఓ యువతి మద్యం తాగి రచ్చ రచ్చ చేసింది. రాత్రి సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాలను ఆపి గందరగోళం చేసింది. రోడ్డు మధ్యలో కార్లను, బైక్‌లను ఆపి.. ఆటోలలో ఎక్కి వీరంగం సృష్టించింది.
Also Read: 'రాబిన్ హుడ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
#Haridwar
— Sunaina Bhola (@sunaina_bhola) April 20, 2025
Dehli Dehradun Highway.
High voltage drama of a drunk woman.
She stopped every vehicle finally stopped a traffic police man & Rided on his scooty🤣😂😇😇#Uttarakhand #SpringRenewal #WomenEmpowerment #Viralvideo #vaibhavsuryavanshi #RupaliGanguly #IPL2025 pic.twitter.com/RWn1Q288zf
దీంతో ఆ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరుసగా కార్లు, బైక్‌లు, ఆటోలతో సహా మరికొన్ని వాహనాలు ఆగిపోయాయి. ఆమె చేస్తున్న రచ్చను పక్కనే చాలా మంది చూస్తూ ఉండిపోయారు. అందులో ఓ వ్యక్తి ఈ ఘటనను తన ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.
Also Read: ఫ్యాన్స్ మీట్‌లో షాకింగ్ డెసిషన్ బయటపెట్టిన సూర్య..
దీంతో అది కాస్త వైరల్‌గా మారింది. కొంతమంది వీక్షకులు ఆమె చర్యలపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆమె ప్రవర్తనను చాలా మంది విమర్శించారు. హరిద్వార్‌లో మద్యం, మాంసంపై కఠినమైన నిషేధాలు ఉండటంతో ఆమె ప్రవర్తన వివాదానికి దారితీసింది.
viral-video | viral-news | latest-telugu-news | Drunken Lady Hulchul | telugu-news