/rtv/media/media_files/2025/04/25/oF311lG2OOjKVPLWnAhr.jpg)
Pakistan Defence Minister Khwaja Asif
పహల్గాం దాటి ఘటన పై పాక్ తన మాట మార్చింది.ఈ ఘటన పై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని చెబుతోంది. ఈ మేరకు ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా మహ్మద్ అసిఫ్ అన్న మాటలను ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది.
Also Read: Hafiz Saeed : మాకు నీళ్లు ఆపితే మీ శ్వాస ఆపుతాం...మోదీకి హఫీజ్ వార్నింగ్!
పహల్గాం ఘటనతో మా దేశానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా భారత్ మమ్మల్ని నిందిస్తోంది.ఈ దాడి పై ఇప్పటి వరకు ఎలాంటి దర్యాప్తు జరిగినట్లు కనిపించడం లేదు. ఒక వేళ దర్యాప్తు జరిగితే సహకరించేందుకు పాక్ సిద్ధంగా ఉంటుంది. అయితే అంతర్జాతీయంగా విచారణ జరగాలని మేం కోరుకుంటున్నాం అని అసిఫ్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
Also Read: Pahalgam terror attack : పహల్గాం ఉగ్రదాడి ఘటనలో కీలక పరిణామం....అనుమానితుడి అరెస్ట్
పహల్గాం దాడి తరువాత నెలకొన్న పరిస్థితిని ..దేశీయ రాజకీయ ప్రయోజనాల కోసం నీటి ఒప్పందాన్ని నిలిపివేయడానికి కారణంగా భారత్ ఉపయోగించుకుంది.ఎలాంటి ఆధారాలు లేకుండా ,దర్యాప్తు జరపకుండానే పాక్ ని శిక్షించాలని అడుగులు వేస్తోంది.
అయితే పరిణామాలు యుద్ధానికి దారి తీయాలని మేం కోరుకోవడం లేదు. ఎందుకంటే..యుద్ధమంటూ జరిగితే ఈ ప్రాంతమంతా నాశనం అవుతుంది కాబట్టి అని అసిఫ్ అన్నారు. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సంస్థ పహల్గాం ఉగ్రదాడికి కారణమని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే.అయితే లష్కరే తోయిబా,హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థల అనుబంధ విభాగమని ,వీటికి పాక్ ప్రభుత్వ అండదండలు..అక్కడి నిఘా వ్యవస్థల సహకారమూ ఉందని భారత భద్రతా సంస్థలు చెబుతున్నాయి.
Also Read: Pahalgam attack : హ్యాట్సాఫ్..ఉగ్రదాడితో ముస్లిం ఆవేదన.. ఇస్లాంను వదిలేస్తూ కోర్టుకు!
Also Read: Heatwave Warning : బయటకు వెళ్తున్నారా? జాగ్రత్త...ఈ రోజు మండనున్న ఎండలు..అరెంజ్ అలర్ట్
pakistan | india | pahalgam | Pahalgam attack | Pahalgam Attack Updates | pahalgam attack explained | Pahalgam Attack latest news | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates