/rtv/media/media_files/2025/04/25/BgUFv4EWditAYkRq6jGF.jpg)
modi, Hafiz Saeed
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత మోదీ సర్కార్ కఠినమైన చర్యలు తీసుకుంది. పాకిస్తాన్‌తో సింధు జల ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకుంది. ఈ నిర్ణయం వల్ల పాకిస్తాన్‌లో నీటి సంక్షోభం తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ప్రధాని మోదీకి వార్నింగ్ ఇచ్చిన పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'మీరు పాకిస్థాన్ కు నీళ్లు ఆపుతారా? కశ్మీర్లో డ్యామ్ కట్టి నీళ్లు ఆపితే మేము మీ శ్వాస ఆపుతాం. ఆ నదుల్లో మీ రక్తం ప్రవహిస్తుంది' అని హఫీజ్ గతంలో మాట్లాడిన వీడియోను పాక్ ISI వైరల్ చేస్తూ పాకిస్థానీలను రెచ్చగొడుతోంది.
A video of terrorist Hafiz Saeed is going viral on Pakistani mainstream and social media where he can be seen threatening Prime Minister Narendra Modi and saying he will strangulate him, if attempts are made to stop Pakistan's water! pic.twitter.com/NwfKtw2LqZ
— Shuvankar Biswas (@manamuntu) April 23, 2025
Also Read : జాగ్రత్తగా చూసుకున్నాడు...మా బంధానికి పేరు పెట్టలేను...సామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ప్రతీ నీటి బొట్టుపై హక్కు ఉంది
మరోవైపు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ తీవ్రంగా విమర్శించింది. సింధు జలాల్లోని ప్రతీ నీటి బొట్టుపై తమకు హక్కు ఉందన్నారు పాకిస్తాన్ మంత్రి అవైస్ అహ్మద్ ఖాన్. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము న్యాయపరంగా, దౌత్యపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలగడమంటే యుద్ధం ప్రకటించడమేనన్నారు. ప్రపంచ బ్యా్ంకు వంటి సంస్థలు కుదుర్చిన ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా వైదొలగలేదని ఆ దేశ మంత్రి అవాయిస్ లేఖరి ఎక్స్ వేదికగా ట్వీ్ట్ చేశారు. సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిర్లక్ష్యంగా నిలిపివేయడం పిరికితనం, చట్టవిరుద్ధమైన చర్య అని పాకిస్తాన్ విద్యుత్ మంత్రి అవాయిస్ లేఖరి ఎక్స్ వేదికగా ట్వీ్ట్ చేశారు.
Also Read : భద్రతా బలగాలకు మావోయిస్టు అగ్రనేత లేఖ
సింధు జలాల ఒప్పందం 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరింది. సింధూ నది టిబెట్లో పుట్టి.. భారత్, పాక్ మీదుగా 3 వేల 180 కిలోమీటర్లు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. మార్గమధ్యంలో ఈ నదిలోకి ప్రధానంగా ఆరు ఉపనదులు కూడా కలుస్తుంటాయి. దేశ విభజన అనంతరం సింధు జలాల నిర్వహణపై భారత్, పాక్ మధ్య ప్రాజెక్టులు కట్టడం, నీటిని వాడుకోవడం, ఇతర విషయాల్లో చాలా విషయాల్లో వివాదాలు వచ్చాయి. దీంతో 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రెసిడెంట్ జనరల్ ఆయూబ్ ఖాన్ సింధు జలాల ఒప్పందంపై ఇరువురు సంతకాలు చేశారు.
Also Read : పెళ్లికెళ్తే చచ్చేంతపనైంది.. తేనెటీగల దాడిలో స్పాట్‌లోనే 50 మంది!
Also Read : విడదల రజనికి ఏపీ హైకోర్టులో భారీ ఊరట!
telugu-news | Jammu and Kashmir | india | Lashkar Chief Hafiz Saeed