TG News: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్!

రంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాచారం మండలం తమ్మలోనిగూడ గెట్ వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను హైదరాబాద్ కి చెందిన వారిగా గుర్తించారు.

author-image
By Archana
New Update
Accident

Accident

TG News: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకు, ట్రావెల్ బస్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. హైదరాబాద్ కి చెందిన ఏడుగురు స్నేహితులు వైజాగ్ కాలనీ నుంచి కారులో వస్తుండగా రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోనిగూడ గేట్ దగ్గర ట్రావెల్ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. మృతులను వి.సాయి తేజ, పవన్ కుమార్, రాఘవేంద్రగా గుర్తించారు.

Advertisment
తాజా కథనాలు