Sitaare Zameen Par: ఫుల్ ఎంటర్ టైనింగ్ గా 'సితారే జమీన్ పర్' తెలుగు ట్రైలర్.. సుధా మూర్తి ప్రశంసలు!

అమీర్ ఖాన్ లేటెస్ట్ సూపర్ హిట్ సీక్వెల్ 'సితారే జమీన్ పర్' తెలుగు ట్రైలర్ విడుదలైంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఫుల్ ఎంటర్ టైనింగ్ గా సాగింది. ఈ చిత్రం జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది.

New Update

Sitaare Zameen Par Telugu Trailer:  బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్  లేటెస్ట్ మూవీ 'సితారే జమీన్ పర్' ఈనెల 20న ప్రపంచవ్యాప్తంగా  థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మూవీ హిందీ ట్రైలర్ విడుదల చేయగా.. తాజాగా తెలుగు వెర్షన్ ట్రైలర్ విడుదల చేశారు. ఎమోషనల్ టచ్ తో ఎంటర్ టైనింగ్ గా రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో అమీర్ ఖాన్  బాస్కెట్ బాల్ కోచ్ పాత్రను పోషించారు. 

ట్రైలర్ లో ఏముంది..?
 
విపరీతమైన కోపం ఉండే బాస్కెట్ బాల్ కోచ్ (అమీర్ ఖాన్) అనుకోని పరిస్థితిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కుంటాడు. దీంతో కోర్టు అతడికి శిక్షగా.. మూడు నెలల పాటు మతిస్థిమితం సరిగా లేని ఆటగాళ్లకు బాస్కెట్ బాల్  కోచింగ్ ఇవ్వాలని కోర్టు ఆదేశిస్తుంది. దీంతో అమీర్ ఖాన్ జీవితం మరో మలుపు తిరుగుతుంది. ఈ ప్రయాణంలో అమీర్ ఖాన్ ఎలా మారుతాడు? మతిస్థిమితం లేని ఆటగాళ్ల జట్టు విజయం సాధిస్తుందా? అనేది సినిమా కథగా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. 

సుధా మూర్తి ప్రశంసలు 

ట్రైలర్ విడుదలైన తర్వాత పలువురు దీనిపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా మానసిక వికలాంగుల పట్ల సానుభూతిని, వారి సామర్థ్యాన్ని చూపించే విధంగా ఉంటుందని అభినందించారు. సుధా మూర్తి లాంటి ప్రముఖులు కూడా సినిమాను చూసి ప్రశంసించారు. ''మానసిక సవాళ్లు ఎదుర్కునే  పిల్లలను చాలా మంది అర్థం చేసుకోరు. ఇలాంటి వారికీ ఎలా సపోర్ట్ గా నిలవాలి అనే విషయాన్నీ ఈ చిత్రంలో గొప్పగా చూపించారు. ఇదొక కనువిప్పు కలిగించే చిత్రమని'' సుధామూర్తి  తెలిపారు. 

Also Read: Ram charan- Trivikram: ఫ్యాన్స్ కి పండగే.. చరణ్- త్రివిక్రమ్ కాంబోలో అదిరిపోయే సినిమా !

Advertisment
Advertisment
తాజా కథనాలు