/rtv/media/media_files/2025/04/20/xm3PiJ0qs4I2XHy0KIVn.jpg)
Thousands Of Protesters Take To Streets Across US Against Trump's Policies
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై అక్కడి ప్రజలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా ట్రంప్‌కు వ్యతిరేకంగా రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా మరోసారి నగర వీధుల్లో ప్లకార్డులతో ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యూయార్క్‌లోని ప్రధాన గ్రంథాలయం బయట జనం గుమికూడారు. అమెరికాలో రాజులు లేరు, ఈ దౌర్జన్యాన్ని ఎదిరించండి అంటూ నినాదాలు చేశారు.
Also Read: సీఎంకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ షాక్.. మర్యాదగా మాట్లాడలేనంటూ ఒమర్ అబ్దుల్లా ఫైర్!
తాత్కాలికంగా ఉంటున్న వలసదారులకు చట్టపరమైన నివాస హోదాను రద్దు చేయడం, వాళ్లని బహిష్కరించడంపై నిరసనాకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీకు ఎలాంటి భయం అవసరం లేదు.. వలసదారులకు స్వాగతం' అంటూ నినాదాలు చేశారు. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ట్రంప్ పాలన ఉందని మండిపడుతున్నారు. ట్రంప్ తన తీరు మార్చుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Also Read: త్వరలోనే ఇండియాకు రాబోతున్నా..: ఎలాన్ మస్క్
F1 స్టూడెంట్ వీసా ముగిసినా కూడా అమెరికాలోనే ఉంటున్న పాలస్తీనా విద్యార్థిని అక్కడి అధికారులు ఇటీవల అరెస్టు చేశారు. ఆ విద్యార్థిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఇటీవల ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా దేశమంతటా అక్కడి ప్రజలు నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. న్యూయార్క్ నుంచి అలస్కా దాకా వీధుల్లో జనం పోటెత్తారు. హ్యాండ్సాఫ్ ట్రంప్ అంటూ నినాదాలు చేశారు. 50 రాష్ట్రాల్లోని 12-00 ప్రాంతాల్లో చేపట్టిన ఈ హ్యాండ్సాఫ్ ట్రంప్ నిరసనలకు ప్రజలు భారీగా తరలివచ్చారు.
Also Read: తెలంగాణ రేషన్ షాపుల్లో ప్లాస్టిక్ రైస్ పంపిణీ? ఉడికించి వీడియో పోస్ట్ చేసిన లబ్దిదారుడు!
Also Read: ‘టీం శివంగి’.. రాష్ట్రంలో తొలిసారి రంగంలోకి మహిళా కమాండోల బృందం!
telugu-news | rtv-news | national-news | trump | Immigrants