/rtv/media/media_files/2025/05/10/OrOWrSKxcRwbbroBIpBe.jpg)
Operation Bunyan-ul-marsoos
భారతదేశం తమపై దాడులు చేస్తోందని...మూడు మిలటరీ ఎయిర్ బేస్ ల మీద అటాక్ చేసిందని పాక్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి చెప్పారు. అందుకు ప్రతిగా తాము దాడులను నిర్వహించామని తెలిపారు. పంజాబ్ తదితర ప్రాంతాల్లో ఆరు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించామని చెప్పారు. భారతదేశం ప్రారంభించిన దాన్ని ముగించడానికి తన సైన్యం సిద్ధమౌతోందని అహ్మద్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ కు వ్యతిరేకంగా ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్ ను ప్రారంభిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ ఆపరేషన్ పేరుతో నిన్న రాత్రి అంతా పాకిస్తాన్ దాడులకు తెగబడుతూనే ఉంది.
Also Read : పబ్‌లో డీజే పరిచయం..డ్రగ్స్‌కు బానిసైన యువ డాక్టర్..కట్ చేస్తే...
బున్యాన్ ఉల్ మర్సూస్ అంటే ఏంటి?
పహల్గాం దాడిలో ఉగ్రవాదులు కావాలని మగవారిని మాత్రమే చంపారు. భారతీయులు పవిత్రంగా భావించే సింధూరాన్ని చెరిపేశామని విర్రవీగారు. అందుకే ఇండియా దానికి ప్రతీకారంగా పాక్ మీద దాడులు చేస్తూ దానికి ఆరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్ మొదలెట్టింది. దీని అర్థం గాజు లాంటి బలమైన గోడ, చాలా బలంగా రక్షించే గోడ అని. ఈ పేరుతో పాకిస్తాన్ ప్రపంచానికి తనను తాను బలంగా చూపించు కోవాలనుకుంటోంది. అందుకే ఈ పేరును సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ పేరు పెట్టిన వెంటనే భారత్ పై ఫతే-1 క్షిపణితో సహా డ్రోన్లు, మిస్సైల్స్ వరుసగా ప్రయోగిస్తూనే ఉంది. పాకిస్తాన్ బున్యాన్ ఉల్ మర్సూర్ అనే పేరును ఖురాన్ లోని ఒక శ్లోకం నుంచి తీసుకుంది.
Also Read : 8 గంటలు.. 3 సర్జరీలు.. ICU లో 'ఇండియన్ ఐడల్ 12' విజేత పవన్ దీప్
అయితే పాకిస్తాన్ ఏ పేరు పెట్టినా, ఎలాంటి దాడి చేసినా భారత్ ను మాత్ర ఆపడం దాని వల్ల కావడం లేదు. భారత్ వరుసపెట్టి పక్క దేశంలో దాడులు చేస్తూనే ఉంది. ఆ దెబ్బలు వాళ్ళకు చాలా గట్టిగానే తగులుతున్నాయి. దానికి తోడు పాకిస్తాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లు, క్షిపణులను భారత సైన్యం తునాతునకలు చేసేస్తోంది. అవి ప్రయోగించిన స్థానాలకు చేరకమందే నేల కూల్చేస్తోంది.
Also Read : బుద్ది మార్చుకోని పాక్.. భారత మహిళా పైలెట్ పట్టుబడ్డారంటూ ఫేక్ న్యూస్!
Also Read : పాక్ దాడులను తిప్పికొట్టాం.. ఆర్మీ సంచలన ప్రెస్ మీట్!
operation | today-latest-news-in-telugu | india pakistan war 2025 | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu | international news in telugu