భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో భారత సైన్యం సంచలన ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ దాడుల గురించి వివరించారు. పాక్ దాడులను తిప్పికొట్టినట్లు కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. పాకిస్తాన్ రెచ్చగొడుతూ దాడులు చేస్తుంది. 24 ఫైటర్ జెట్‌లతో భారత్‌పై దాడికి దిగింది. వీటిని భారత్ తిప్పికొట్టిందని తెలిపారు. ప్రతీకార దాడుల్లో బాలిస్టిక్ క్షిపణులు ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: మళ్లీ మొదలైన యుద్ధం.. పాకిస్థాన్ కాల్పులు
పౌరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా..
పంజాబ్ ఎయిర్‌బేస్‌లు, శ్రీనగర్ స్కూళ్లను టార్గెట్ చేసి పాక్ దాడులకు పాల్పడుతుందన్నారు. శ్రీనగర్‌లోని సైనిక స్థావరాలపై దాడులకు దిగింది. S-400ను ధ్వంసం చేశామంటూ పాక్ తప్పుడు ప్రచారం చేస్తోంది. కానీ ఇది అసత్యమని, పాకిస్తాన్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. పాక్ ఎక్కువగా పశ్చిమ సరిహద్దు దేశాల్లో దాడులకు పాల్పడుతుందని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. అలాగే పౌరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూశామన్నారు. భారత్ ఎయిర్‌బేస్‌లకు ఎలాంటి నష్టం జరగలేదని, కావాలనే పాక్ విషం కక్కుతుందని వ్యోమికా సింగ్ అన్నారు.
ఇది కూడా చూడండి: Pakistan: 'మా రాజకీయ నేతల ఇళ్లపై దాడులు చేయండి'.. పాక్‌లో ప్రజల తిరుగుబాటు
పాక్ సైన్యానికి భారత్ తీవ్ర నష్టం కలిగించింది. ఇకపై ఉద్రిక్తతలు పెరగకూడదని భావిస్తున్నామని ప్రెస్‌మీట్‌లో తెలిపారు. పాక్ మాత్రం భారత పౌర ప్రాంతాలు, సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించిందన్నారు. దేశంలో మొత్తం 26 ప్రదేశాల్లో దాడులు జరిగాయని వాటిని భారత సైన్యం తిప్పి కొట్టిందని తెలిపారు. భారత్ కూడా కొన్ని నష్టాలను చవి చూడాల్సి వచ్చిందన్నారు.
ఇది కూడా చూడండి: IND-PAK WAR: వార్ ఎఫెక్ట్.. Deloitte, HCL, టెక్ మహీంద్రాతో పాటు WFH ప్రకటించిన కంపెనీల లిస్ట్ ఇదే!
🚨Press Briefing on #OperationSindoor
— PIB in Goa (@PIB_Panaji) May 10, 2025
India's Foreign Secretary Vikram Misri, accompanied by Colonel Sofiya Qureshi and Wing Commander Vyomika Singh, held a press conference condemning #Pakistan's provocative actions
Catch the key highlights⬇️#IndiaFightsPropaganda pic.twitter.com/3A7fL3Gc8K
ఇది కూడా చూడండి: IND-PAK WAR: వైమానిక దాడులు పగలు కాకుండా రాత్రే ఎందుకు జరుగుతాయి.. సీక్రెట్ ఇదే!