PIB Fact Check: బుద్ది మార్చుకోని పాక్.. భారత మహిళా పైలెట్ పట్టుబడ్డారంటూ ఫేక్ న్యూస్!

భారత మహిళా పైలెట్ శివానీ సింగ్ పాక్ ఆర్మీకి చిక్కారు అనేది పచ్చి అబద్ధం అంటోంది పీఐబీ ఫ్యాక్ట్ చెక్. పాకిస్తాన్ అనుకూల మీడియా తప్పుడు ప్రచారాలతో భారత్ ను భయపెట్టాలని చూస్తోందని చెప్పింది. 

New Update
pib

Sivani Singh

భారతీయ మహిళా వైమానిక దళ పైలట్ స్క్వాడ్రన్ లీడర్ శివానీ సింగ్ జెట్ నుండి దూకినప్పుడు పాకిస్తాన్‌లో బంధిచబడ్డారని వార్తలు వచ్చాయి. దానికి సంబంధించి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే అవన్నీ అబద్ధం అంటోంది పీఐబీ. పాక్ అనుకూల మీడియా చేస్తున్న దుష్ప్రచారాలను కొట్టిపడేసింది. ఇలాంటి వాటితో భారత్ ను భయపెట్టాలని పాక్ అనుకుంటోందని పీఐబీ విరుచుకుపడింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై  దాడి జరిగినప్పటి నుండి, భారతదేశం గురించి చాలా నకిలీ వార్తలు , తప్పుడు సమాచారం వ్యాపించాయి. వాటన్నింటినీ పీఐబీ ఎప్పటికప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేస్తూ వస్తోంది.  కొద్దిసేపటి క్రితం.. భారత పైలట్ పీఓకేను తప్పించుకున్నాడని, పాకిస్తాన్ S-400 ను ధ్వంసం చేసిందని, హిమాలయాలలో IAF జెట్‌లు కూలిపోయాయని వచ్చిన నకిలీ వాదనలపై కూడా పీఐబీ నకిలీవని కొట్టిపారేసింది. 

లెఫ్టినెంట్ శివాంగి సింగ్ భారత నావికాదళంలో పనిచేస్తున్న భారతీయురాలు. ఆమె బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలోని ఫెతేహాబాద్ గ్రామానికి చెందిన వారు.  గతంలో పిలాటస్ విమానాన్ని నడిపారు. లెఫ్టినెంట్ శుభాంగి స్వరూప్, లెఫ్టినెంట్ దివ్య శర్మలతో సహా భారత నావికాదళంలోని మొదటి ముగ్గురు మహిళా పైలట్ల బ్యాచ్‌లో శివానీ ఒకరు. 

 

today-latest-news-in-telugu

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు