/rtv/media/media_files/2025/05/10/19T78onrf9nHQMFi6mhO.jpg)
Indian Idol 12 winner Pawandeep Rajan
Indian Idol winner Pawandeep: బిగ్గెస్ట్ రియాలిటీ షో 'ఇండియన్ ఐడల్' సీజన్ 12 విజేత పవన్ దీప్ రాజన్ ఇటీవలే ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన నోయిడాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా పవన్ టీమ్ అతడి ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. శరీరంలోని పలు భాగాల్లో చాలా ఫ్రాక్చర్లు కావడంతో 3 శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు. దాదాపు 8 గంటల ఆపరేషన్ కొనసాగినట్లు వివరించారు.
3 సర్జరీలు.. 8 గంటల
దీనిపై అతడి టీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు.. ''అందరికీ నమస్కారం, పవన్‌దీప్‌కి నిన్న మరో 3 సర్జరీలు జరిగాయి. ఉదయం ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లగా .. 8 గంటల తర్వాత బయటకు వచ్చాడు. శరీరంలోని అన్ని ఫ్రాక్చర్లకు ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం పవన్ ఐసీయూలోనే ఉన్నాడు. మరికొన్ని రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. త్వరలోనే పవన్ కోలుకుంటారని వైద్యులు చెప్పారు. పవన్ దీప్ కోసం ప్రార్థించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు '' అని తెలిపారు.
ఇది కూడా చదవండి: Khammam Digital Arrest: ఖమ్మంలో డిజిటల్ అరెస్ట్ కలకలం.. ఒక్క కాల్ తో రూ.26 లక్షలు ఎలా కొట్టేశారంటే?
మే 5న అర్థరాత్రి మొరాదాబాద్ సమీపంలో పవన్ వెళ్తున్న కారు ట్రక్కును ఢీకొట్టింది. ఒక కార్యక్రమం కోసం ఢిల్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. డ్రైవింగ్ సమయంలో డ్రైవర్ అకస్మాత్తుగా నిద్రపోవడంతో యాక్సిడెంట్ జరిగింది.
telugu-news | latest-news | Indian Idol 12 winner Pawandeep | Indian Idol Pawandeep Health Update
ఇది కూడా చదవండి: Warangal Fire Accident: వరంగల్‌లో భారీ అగ్ని ప్రమాదం..30 ఎకరాల్లో పంట దగ్ధం