/rtv/media/media_files/2025/05/10/jHQ0RyAfUzxcUYUUgQaj.jpg)
Doctor drug addict
Young Doctor : మనం ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిని సక్రమంగా నిర్వర్తిస్తేనే తగిన గుర్తింపు వస్తోంది. అందులోనూ డాక్టర్, పోలీసు, టీచర్, ఇంజినీరు ఇలాంటి ప్రత్యేక వృత్తుల్లో ఉన్నవారు తమ వృత్తిని సంక్రమంగా చేయకపోతే ఆ ప్రభావం సమాజం మీద పడుతోంది. తద్వారా బంగారు భవిష్యత్తు నాశనమవుతుంది. ఓ యువ వైద్యురాలి విషయంలో అక్షరాల అలాగే జరిగింది. ఎంతో కష్టపడి చదివి డాక్టర్ అయిన ఆ వైద్యురాలు దైవం లాంటి వైద్య వృత్తిని నిర్లక్ష్యం చేసింది. చెడు వ్యసనాలకు అలవాటు పడింది. ఫలితంగా బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంది. చివరికి పోలీసుల చేతికి చిక్కి ఇప్పుడు కటకటాలు లెక్కిస్తోంది. ఇంతకు ఆ యువ వైద్యురాలు చేసిన తప్పేంటి? ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి కారణం ఏంటో తెలిస్తే అందరూ షాక్ అవుతారు.
Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!
డ్రగ్స్ ప్రపంచాన్ని పట్టి పీడుస్తున్న పెనుభూతం. ఈ భూతం భారిన పడి ఎందరో తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్‌ను అరికట్టడానికి ప్రభుత్వాలు, పోలీసులు తీవ్రంగా శ్రమిస్తు్న్నారు. యువత డ్రగ్స్‌కు బానిసకావొద్దని తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని పోలీసులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. కానీ యువత వాటిని పెడ చెవిన పెట్టి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్‌కు అలవాటు పడి వాటిని తీసుకోవడం, కొనడం, అమ్మడం చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు.
ఇది కూడా చూడండి: IND-PAK WAR: వైమానిక దాడులు పగలు కాకుండా రాత్రే ఎందుకు జరుగుతాయి.. సీక్రెట్ ఇదే!
అలాంటిదే ఈ యువవైద్యురాలి కథ. ఈ వైద్యురాలు కూడా మత్తు పదార్థాలకు బానిసగా మారింది. అందులో భాగంగా కొకైన్‌ను ఆర్డర్ పెట్టి తీసుకుంటున్న సమయంలో పోలీసులు పక్కా ప్లాన్‌తో వైద్యురాలితో పాటు డ్రగ్స్ డెలివరీ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ యువ వైద్యురాలు షేక్ పేటలోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో నివాసముంటోంది. ఒకసారి మహారాష్ట్రలోని థానేకు వెళ్లింది. అక్కడి ఓ పబ్బులో డీజేతో డాక్టర్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో డీజే వైద్యురాలికి డ్రగ్స్ అలవాటు చేశాడు. అలా వైద్యురాలు డ్రగ్స్‌కు బానిసైంది. అప్పటి నుంచి డగ్స్ లేకుండా ఉండలేని స్థితికి చేరింది. ఈ క్రమంలో డ్రగ్స్ కోసం ఆర్డర్ పెట్టింది. ఆమె కోసం ముంబైకి చెందిన డ్రగ్ డీలర్ వంశ్ ఠక్కర్ ఒక అనుచరుణ్ణి ఏర్పాటు చేశాడు.ఆ అనుచరుడు రంగంలోకి దిగాడు. ఆమెకు డ్రగ్స్ సరఫరా చేయడం మొదలు పెట్టాడు.
ఇది కూడా చూడండి: Pakistan: 'మా రాజకీయ నేతల ఇళ్లపై దాడులు చేయండి'.. పాక్‌లో ప్రజల తిరుగుబాటు
అలా మత్తు పదార్థాలకు బానిసగా మారిన ఈ యువ వైద్యురాలు గడచిన ఏడాడి కాలంలో ఏకంగా రూ.70 లక్షల విలువచేసే కొకైన్‌ను కొనుగోలు చేసింది. ఆమెతో డ్రగ్ డీలర్ వంశ్ ఠక్కర్ నేరుగా లావాదేవీలు జరిపినట్లు తేలింది. అదే క్రమంలో తాజాగా 53 గ్రాముల కొకైన్ ఆర్డర్ పెట్టి టీజీఎన్‌ఏబీకి అడ్డంగా దొరికిపోయింది వైద్యురాలు. ఎప్పటిలాగే వైద్యురాలు డ్రగ్స్ ఆర్డర్ పెట్టగా.. డ్రగ్స్ డెలివరీ ఇచ్చేందుకు వంశ్ ఠక్కర్ అనుచరుడు వచ్చాడు. ఈ విషయం తెలిసిన వెంటనే టీజీఎన్‌ఏబీ సిబ్బంది అక్కడకు చేరుకుని రెడ్ హ్యాండెడ్‌గా వారిని పట్టుకున్నారు. వంశ్ ఠక్కర్‌తో సంప్రదింపులు జరిపేందుకు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉందని విచారణలో తేలింది.. ఆ వాట్సాప్ గ్రూప్‌లో ప్రముఖులతో పాటు, పలువురు వ్యాపారవేత్తల పిల్లలు ఉన్నట్టు సమాచారం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చూడండి: IND-PAK WAR: వార్ ఎఫెక్ట్.. Deloitte, HCL, టెక్ మహీంద్రాతో పాటు WFH ప్రకటించిన కంపెనీల లిస్ట్ ఇదే!