Musk-India:-Modi: త్వరలోనే ఇండియాకు రాబోతున్నా..: ఎలాన్ మస్క్

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత దేశంలో పర్యటించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్ వేదికగా ప్రకటించారు. శుక్రవారం రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన..శనివారం ఈ పోస్ట్ చేశారు.

New Update
PM speaks to Elon Musk

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వంలో కీలక డోజ్ శాఖ అధిపతిగా వ్యవహరిస్తున్న ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ త్వరలోనే భారత పర్యటనకు రానున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. శుక్రవారం రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. శనివారం ఈ పోస్ట్ చేశారు. భారత ప్రధాని మోదీతో మాట్లాడడం చాలా గౌరవంగా ఉందని చెబుతూనే.. భారత్‌ ని సందర్శించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.

Also Read:BIG BREAKING: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఖాళీలు, ముఖ్యమైన తేదీల వివరాలివే!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రోజు.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌తో ఫోన్‌లో మాట్లిడినట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. అనేక అంశాలపై చర్చించామని చెప్పారు. ముఖ్యంగా వీరిద్దరి సంభాషణలో సాంకేతిక, నూతన ఆవిష్కరణల్లో సహకారం, భాగస్వామ్యం గురించి చర్చించినట్లు మోదీ ప్రకటించారు. ఈ పోస్టుకు రిప్లై ఇస్తూనే... ఎలాన్ మస్క్ ఈ ఏడాది చివర్లో భారత్‌కు వస్తానని తన పోస్టులో పేర్కొన్నారు. 'భారత ప్రధాని మోదీతో మాట్లాడటం గౌరవంగా ఉందని.. ఈ ఏడాది చివర్లో భారతదేశాన్ని వచ్చేందుకు నేను ఎంతో ఆసక్తిగా ఉన్నాను' అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్టు వైరల్‌గా మారింది.

Also Read: Telangana: వదలని వర్షాలు.. మరో 2 రోజులు వానలే..వానలు..!

ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని రెండు రోజుల అమెరికా పర్యటన సందర్భంగా వాషింగ్టన్ డీసీలో మస్క్‌తో భేటీలో చర్చకు వచ్చిన అంశాలను గురించి మాట్లాడుకున్నట్లు వివరించారు . ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనం, అంతరిక్షం వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో అలాగే సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న ప్రాముఖ్యతపై ఫోన్‌లో చర్చించినట్లు వెల్లడించారు. ఈ రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ తన పోస్టులో చెప్పుకొచ్చారు. టారిఫ్‌ల విషయంలో భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చల అంశం కొనసాగుతున్న వేళ వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషణ ఆసక్తికరంగా మారింది.

 మస్క్‌తో మీటింగ్‌ సందర్భంగా  మోదీ మస్క్ పిల్లలకు పుస్తకాలను బహుమతిగా అందించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసి ది క్రెసెంట్ మూన్, ది గ్రేట్ ఆర్కే నారాయణ్ కలెక్షన్, పండిట్ విష్ణు శర్మ రాసిన పంచతంత్రను బహుమతిగా అందజేశారు. తర్వాత పిల్లలు పుస్తకాలు చదువుతున్నట్లు చూపించే ఫోటోలను ఆయన పంచుకున్నారు. 

Also  Read:Chhattisgarh: కార్మికుల గోళ్లు తొలగించి..విద్యుత్‌ షాక్‌ ఇచ్చి..!

Also Read:America-Russia: క్రిమియా పై రష్యా నియంత్రణకు సరే అన్న అగ్రరాజ్యం!

musk | Elon Musk | modi | india | visit | post | twitter | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు