/rtv/media/media_files/2025/02/01/R5hlEEqsLRiA5ENLJMx7.jpg)
Donald Trump
రష్యా-ఉక్రెయిన్ ల మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా,క్రిమియా పై రష్యా నియంత్రణను గుర్తించడానికి అమెరికా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ శాంతి ప్రతిపాదన వల్ల రెండు దేశాల మధ్య తక్షణ కాల్పుల విరమణ అమల్లోకి రానుంది.అందులో భాగంగా రూపొందించిన ఫ్రేమ్ వర్క్ ను ఉక్రెయిన్, యూరోపియన్ అధికారులు పారిస్ లో పరిశీలించారు.
క్రిమియా పై రష్యా నియంత్రణ కొనసాగడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుకూలంగా ఉన్నట్లు అధికారులు వివరించారు. యూఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో,రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ ఈ ప్రతిపాదన పై ఫోన్ కాల్ లో చర్చలు జరిపారు. ఈ శాంతి ఒప్పందం పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సానుకూలంగా ఉన్నారని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇటీవల పేర్కొన్నారు.
Also Read: Canada: కెనడాలో కాల్పులు..భారతీయ విద్యార్థిని మృతి!
America Russia Ukraine
రష్యా ఆక్రమించుకొన్న భూమి పై ఉక్రెయిన్ ఆశలు వదులుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు.అప్పుడే సంధి జరిగియుద్ధం ఆగుతుందన్నారు. అయితే యుద్ధం ముగించడం సాధ్యం కాని పక్షంలో..చర్చల ప్రయత్నాలు ఆపేసి అమెరికా తన దారి తాను చూసుకుంటుందని తెలిపారు. కాగా ఈ ఒప్పందంలోని పలు విషయాల పై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. వచ్చే వారం లండన్ లో యూరప్, ఉక్రెయిన్ తో అమెరికాఈ విషయం పై చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తాజాగా ఐరోపా నేతలతో భేటీ సందర్భంగా ఉక్రెయిన్ శాంతి ఒప్పందం పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.అతి తొందరలోనే ఇది సాకారం కావొచ్చని పేర్కొన్నారు.అమెరికా ఓ శాంతి ఒప్పందం ముసాయిదా తయారు చేసి ఐరోపా నేతలకు వెల్లడించగా..వారి నుంచి సానుకూల స్పందనలు వచ్చినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. యుద్ధం ముగింపులో భాంగా ఉక్రెయిన్ తో ఖనిజాల ఒప్పందానికి సంబంధించిన మెమోరాండం ఆఫ్ ఇంటెంట్ పై సంతకం చేశారు.
కాగా రష్యా నుంచి ఉక్రెయిన్ స్వాధీనం చేసుకున్న కర్క్స్ ప్రాంతాన్ని మాస్కో దళాలు తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాయి. యుద్ధానికి ముగింపు పలకాలంటే కీవ్‌కు నాటో సభ్యత్వం ఇవ్వకకుండా ఉండడం, విదేశీ దళాలను ఉక్రెయిన్ లోకి అనుమతించకపోవడం,క్రిమియా మరో నాలుగు ప్రావిన్స్‌లు రష్యాకు చెందుతాయని అంగీకరించడం వంటి డిమాండ్లను నెరవేర్చాలని రష్యా అడుగుతుంది.
Also Read: USA: పాస్ట్ పోర్ట్, సోషల్ మీడియాల్లో గాజా అని ఉంటే వీసా రద్దు..అమెరికా కొత్త రూల్
Also Read: Manasa Sarovar: ఐదేళ్ల తర్వాత మానస సరోవర యాత్రకు ఓకే..భారత, చైనా సంబంధాల్లో కీలక మలుపు
america | russia | ukrain | trump | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates