/rtv/media/media_files/2025/06/30/tg-bjp-2025-06-30-16-41-08.jpg)
Telangana bjp
జాతీయ, రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికలో బీజేపీ పక్కా వ్యూహం ప్రకారమే ముందుకెళ్తోంది. మొదటినుంచి పార్టీలో ఉండి, పార్టీ కోసం పనిచేసివారికే పట్టం కడుతోంది. ఇతర పార్టీలనుంచి వసల వచ్చిన ఎంత పెద్ద నాయకుడైనా సరే ప్రెసిడెంట్ ఎన్నికలో పక్కన పెట్టేస్తోంది. తాజాగా తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక నేపథ్యంలో ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. తమకు అధ్యక్ష పదవి వస్తుందని ఆశించిన ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్ లకు నిరాశే మిగిలింది. వీరందరినీ కాదని కోర్ బీజేపీ నేత అయిన మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావుకే బీజేపీ అధిష్టానం మొగ్గుచూపింది.
Also Read : రాజాసింగ్ రాజీనామాపై స్పందించిన బీజేపీ.. షాకింగ్ కామెంట్స్!
నియమం తప్పని బీజేపీ..
భారతీయ జనతా పార్టీ తమ నియమాల ప్రకారం దేశవ్యాప్తంగా పూర్తిస్థాయి బీజేపీ నేతలకే బాధ్యతలు అప్పగిస్తోంది. మొదట దత్తత్రేయ ఆ తర్వాత కిషన్ రెడ్డి, లక్షణ్, బండి సంజయ్ కి ప్రెసిండెంట్ ఛాన్స్ ఇచ్చింది. అయితే బండి సంజయ్ దిగిపోయిన తర్వాత ఇటీవల పార్టీలో చేరిన కీలక నేతలు ఈటల, రఘునందన్, అర్వింద్ ను కాదని 2023లో మళ్లీ కిషన్ రెడ్డికే బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు తాజాగా విద్యార్థి దశలో ABVPలో, ఆ తర్వాత RSSతో మంచి సంబంధం కలిగివున్న రామచందర్‌రావునే రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంచుకుంది.
Also Read : వరకట్న వేధింపులకు మరో మహిళ బలి
సొంత నేతలకు పట్టం..
ఈ మేరకు మొదట బండారు దత్తత్రేయ ఉమ్మడి రాష్ట్ర విభాగానికి పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2010లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి తొలిసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన 2014లో కిషన్ రెడ్డి తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. వీరిద్దరి తర్వాత 2016 నుంచి 2020 వరకు మళ్లీ కోర్ నాయకుడైన లక్షణ్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. ఇక కార్యకర్తగా మొదలుపెట్టి కేంద్ర మంత్రిగా ఎదిగిన బండి సంజయ్ కి 2020 నుంచి 2023 వరకు రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించారు. బండి సంజయ్ హయాంలో బీజేపీకి తెలంగాణలో ఉహించని స్థాయిలో ఊపువచ్చింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల బండి సంజయ్ ను తప్పించి 2023 జూలైలో మళ్లీ సొంత నాయకుడైన కిషన్ రెడ్డినే బీజేపీ కేంద్ర నాయకత్వం నియమించింది.
Also Read : రాజాసింగ్ రాజీనామాపై పొన్నం షాకింగ్ కామెంట్స్!
వలస నేతలను వాడుకుంటోంది..
అయితే బండి సంజయ్‌ని తప్పించిన తర్వాత బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఈటల, రఘునందన్ రావుతోపాటు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ధర్మపురి అర్వింద్ సైతం అధ్యక్ష పీఠం కోసం పోటీపడ్డారు. తప్పకుండా తమకే అవకాశం వస్తుందని ఆశించారు. కానీ వీరందరినీ పక్కనపెట్టి అనూహ్యంగా బండి తర్వాత కిషన్ రెడ్డికే మళ్లీ పట్టం కట్టింది మోదీ నేతృత్వంలోని బీజేపీ. ఇప్పుడు 2025లోనూ మరోసారి ఈ ముగ్గురు ఈటల, రఘునందన్, అర్వింద్ ప్రెసిండెట్ సీటుపై కన్నేశారు. కానీ పార్టీ నియమాలను తూచ తప్పకుండా పాటిస్తున్న భారతీయ జనతా పార్టీ.. వలస వచ్చిన నేతలను పార్టీ ఎదుగుదలకోసం వాడుకుంటోంది తప్పా ఎలాంటి బాధ్యతలు అప్పగించట్లేదు. వారి సొంత బలంతో ఎన్నికల్లో గెలుస్తూ సత్తా చాటుతున్నప్పటికీ వారి మైలేజినీ పార్టీ బలోపేతం కోసంమాత్రమే ఉపయోగించుకుంటోంది. ఈ పరిణామాలన్నీంటిని క్షుణ్ణంగా గమనిస్తే ఇక తెలంగాణలో ఈటల, రఘునందర్, అరవిందుకే కాదు ఇతర పార్టీలనుంచి వచ్చిన ఎవరికీ అధ్యక్ష పీఠం దక్కదనే చర్చ సాగుతోంది.
Also Read : అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి.. కార్పొరేటర్ వద్ద పనిచేస్తూ..
latest-telugu-news | telugu-news | today-news-in-telugu | telangana politics today | bjp-etela-rajender | bjp mp raghunandan