July Month New Rules: జూలై 1వ తేదీ నుంచి మారనున్న రూల్స్ ఇవే!

జూలై 1వ తేదీ నుంచి యుపీఐ ఛార్జ్, కొత్త పాన్ కార్డులకు ఆధార్ కార్డు, తత్కాల్ టికెట్ బుకింగ్‌లో రూల్స్ మారనున్నాయి. కొత్త పాన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డు ఉండాలి. అలాగే జనన ధృవీకరణ పత్రం, ఆధార్ వెరిఫికేషన్ ఉంటేనే జరుగుతుంది. 

New Update
July

July Month New Rules: జూలై 1వ తేదీ నుంచి కొన్ని రూల్స్ మారనున్నాయి. సాధారణంగా ప్రతీ నెల గ్యాస్ సిలిండర్ ధరలు, కొన్ని కొత్త రూల్స్ వంటివి వస్తుంటాయి. మరి జూలై 1వ తేదీ నుంచి రానున్న ఆ మార్పులేంటో ఈ స్టోరీలో చూద్దాం. 

యుపీఐ ఛార్జ్

ఛార్జ్ బ్యాక్ అభ్యర్థన తిరస్కరణకు గురైతే చట్టబద్ధమైన సందర్భాల్లో కూడా యుపీఐ రిఫరెన్స్ కంప్లయింట్స్ సిస్టమ్ ద్వారా కేసును వైట్ లిస్ట్ చేయడానికి బ్యాంక్ ఎన్పిసిఐని సంప్రదించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఎన్పిసిఐ జోక్యం అవసరం లేదు. వీటి కోసం వేచి ఉండకుండా ఛార్జ్ బ్యాక్‌లను రీప్రాసెసింగ్ చేయవచ్చు.

కొత్త పాన్ కార్డులు 
జూలై 1వ తేదీ నుంచి కొత్త పాన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి. అలాగే జనన ధృవీకరణ పత్రం కూడా కావాలి. పాన్ కార్డు కావాలంటే తప్పకుండా ఆధార్ వెరిఫికేషన్ ఉంటేనే జరుగుతుంది. 

ఇది కూడా చూడండి: TG Crime: ప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యంతో పసికందు మృతి...తీవ్ర ఉద్రిక్తత

తత్కాల్ టికెట్ బుకింగ్ 
ఐఆర్‌సీటీ ద్వారా తత్కాల్ టికెట్లు బుకింగ్‌కు తప్పనిసరిగా ఆధార్ ధృవీకరణ ఉండాలి. తత్కాల్ రైలు టికెట్ బుకింగ్స్‌కు జూలై 15 నుంచి వన్ టైమ్ పాస్వర్డ్ కూడా అవసరం. 

ఇది కూడా చూడండి: DK Shiva Kumar: మరో 2 నెలల్లో కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ?

30 నిమిషాల్లోపు
బుకింగ్ విండో తెరిచిన 30 నిమిషాల్లోపు తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోలేని వారికి రైల్వే శాఖ పరిమితిని ప్రవేశపెట్టింది. ఏసీ క్లాస్ తత్కాల్ టికెట్లకు ఉదయం 10:00 గంటల నుంచి 10:30 గంటల వరకు బుక్ చేసుకోవచ్చు. నాన్ ఏసీ క్లాస్ తత్కాల్ టికెట్లు వారు ఉదయం 11:00 గంటల నుంచి 11:30 గంటల వరకు ఉంటుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు