🔴Live Breakings: సన్‌రైజర్స్ విధ్వంసం.. కేకేఆర్ టార్గెట్ 279 పరుగులు
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లిన యువతి చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని చనిపోయింది. మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మే 23 రాత్రి డిన్నర్‌కు వెళ్లిన ఆమె చికెన్ పీస్ గొంతులో ఇరుక్కొని ఊపిరాడక చనిపోయింది.
తమిళనాడులోని మధురై జిల్లాలో దారుణం జరిగింది. ఆదివారం ఉదయం రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయాలపాలయ్యారు.
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లోని ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ACP ఆఫీస్ పైకప్పు కూలిపోయింది. డ్యూటీలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ వీరేంద్ర మిశ్రా ఆఫీస్‌లోనే చిక్కుకుపోయారు. 58 ఏళ్ల మిశ్రా బిల్డింగ్ శిథిలాలు మీద పడి ప్రాణాలు కోల్పోయారు.
చత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టు నాయకుల మృతదేహాల తరలింపులో పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని మావోయిస్టుల బంధువులు, పౌరహక్కలు నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఎన్ కౌంటర్ లో అగ్రనేతలు నంబాల కేశవరావు, నవీన్ లతో పాటు 26 మంది మరణించారు.
అక్రమంగా అమెరికా వీసాలు ఇప్పిస్తున్న ఇద్దరు పాకిస్తానీలను ఎఫ్‌బీఐ అధికారులు అరెస్టు చేశారు. వీరు అమెరికాలో ఉద్యోగాలు సృష్టించినట్లు ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి అక్రమంగా వీసాలు పొందేవారు. వాటిని విదేశీయులకు పెద్ద మొత్తంలో అమ్ముకునే వారు.
కర్ణాటకలో ఈ ఏడాదిలో తొలి కోవిడ్-19 మరణం శనివారం నమోదైంది. 85 ఏళ్ల వృద్ధుడు కోవిడ్ కారణంగా మృతి చెందినట్లు తెలుస్తోంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో వైట్ ఫీల్డ్‌లోని ఆసుపత్రిలో చేరి మృతి చెందాడు.
కర్నాటకకు చెందిన రామలింగ మఠాధిపతి లోకేశ్వరస్వామిను పోలీసుల అరెస్టు చేశారు. బెళగావిలో 17 ఏళ్ల బాలికను లాడ్జిలో రెండు రోజుల పాటు అత్యాచారం చేసి మహాలింగపుర బస్టాండ్‌లో బాలికను వదిలేశాడు. దీంతో ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేశారు.
కరీంనగర్‌కి చెందిన సునీల్, జ్యోతికు గతేడాది వివాహం జరగ్గా ఇటీవల జ్యోతికు శ్రీమంతం నిర్వహించారు. పుట్టింట్లో ఉన్న జ్యోతిని తీసుకువస్తుండగా బైక్ మీద నుంచి కింద పడి మృతి చెందింది. భార్య మృతి చూడలేని భర్త యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.