/rtv/media/media_files/2025/09/04/she-teams-arrest-2025-09-04-21-33-29.jpg)
Khairatabad Ganesh
Khairatabad Ganesh:
దేశవ్యాప్తం ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహా గణేష్ మండపం పరిసరాల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. నవరాత్రుల్లో గణనాథుని దర్శించుకోడానికి వచ్చిన మహిళా భక్తులను వేధించిన వారిని షీ టీమ్స్ అదుపులోకి తీసుకుంది. 9 రోజుల వ్యవధిలో మహిళలను వేధింపులకు గురి చేసిన 930 మంది ఆకతాయిల్ని షీ టీమ్స్ అదుపులోకి తీసుకున్నాయి. వారి వివరాలను గురువారం వెల్లడించారు.
Also Read: సంచలన వీడియో.. సమోసా కోసం గొడవ.. భర్తను పొట్టు పొట్టు కొట్టిన భార్య..!
#Hyderabad:
— NewsMeter (@NewsMeter_In) September 4, 2025
Over the last 7 days, #SHETeams nabbed as many as 900 #miscreants for harassing #women near the #KhairatabadGanesh pandal, 55 caught red-handed.#Police counselled the offenders; some will be produced in court.
SHE Teams remain on 24×7 duty during idol immersion.… pic.twitter.com/tlcXuKVXrr
Also Read: ఇదే మావా అసలైన అదృష్ణమంటే.. దెబ్బకు రూ.35 కోట్లు సొంతం
వారిలో 55 మంది మైనర్లు కాగా.. మిగతావారంతా మేజర్లే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో ఖైరతాబాద్ మహాగణపతి మండపం పరిసరాల్లోనే 15 మంది షీ టీమ్స్‌తో నిఘా ఏర్పాటు చేశారు. నిమజ్జనం సమయంలో ఎవరైనా ఆకతాయిలు వేధిస్తే.. డయల్ 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీమ్స్ పోలీసు అధికారులు హెచ్చరించారు.
నవరాత్రులు చివరి రోజు
నవరాత్రులు ముగుస్తుండటంతో మహా గణపతిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఖైరతాబాద్ పరిసరాలు రద్దీగా మారాయి. ముందస్తు నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా బడా గణేశ్ దర్శనానికి గురువారం రాత్రి 11 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. దర్శనానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో VIP దర్శనాలు నిలిపివేశారు. క్యూలైన్‌లో ఉన్న వారినే అనుమతిస్తున్నారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తులు ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్నారు. బుధవారం తోపులాట జరిగి పలువురు స్పృహ కోల్పోయిన విషయం తెలిసిందే. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.