Crime: మరో ఘోరం.. వేరు కాపురం పెడదామన్న భార్య.. ముక్కలు ముక్కలుగా నరికి చంపిన భర్త!

మహారాష్ట్రలోని భివండిలో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి.. ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి సముద్రంలో పారేశాడు. ఇంటిని వేరుగా పెట్టుకునే విషయంలో ఆగస్టు 28న దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Maharashtra Crime News

Maharashtra Crime News

కాపురం అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడం మాత్రమే కాదు. అది రెండు హృదయాలు, రెండు ఆత్మలు, రెండు కుటుంబాలు ఒకటయ్యే ఒక మహోన్నత బంధం. ప్రేమ, నమ్మకం, సహనం, అవగాహనలతో ఈ బంధాన్ని గట్టిగా నిర్మించుకుంటారు. కష్టసుఖాలు, ఆటుపోట్లు కలిసి ఎదుర్కొంటూ జీవిత పయనంలో ఒకరికొకరు తోడుగా ఉండే గొప్ప ప్రయాణం. సంసారంలో సంతోషం, సంతృప్తి, ఆప్యాయతలు ఉంటాయి. కొత్త ఆశలకు, కలలకు ఈ పయనమే పునాది వేస్తుంది. జీవితాన్ని అర్థవంతంగా మార్చే.. అందమైన జ్ఞాపకాలను మిగిల్చే ఈ కాపురం ఒక అద్భుతమైన జీవిత పాఠం. అది ఒక పవిత్రమైన బంధం, సంతోషాల నిలయం. అయితే అలాంటి పచ్చని కాపురంలో ఓ గోరం జరిగింది. 

వేరు కాపురం పెడదామన్నందుకు..

మహారాష్ట్రలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి.. ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి సముద్రంలో పారేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భివండికి చెందిన మహమ్మద్ తాహా అలియాస్ సోను ఇంతియాజ్ అన్సారీ, పర్వీన్ అలియాస్ ముస్కాన్‌ను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే.. తరచుగా వారి మధ్య గొడవలు జరిగేవి. ఇంటిని వేరుగా పెట్టుకునే విషయంలో ఆగస్టు 28న దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవ తర్వాత ముస్కాన్ ఇంటిని విడిచి వెళ్లిపోయింది. ఆగస్టు 29న మళ్ళీ ఇద్దరి మధ్య గొడవ జరిగి తాహా కోపంతో తన భార్యను హత్య చేశాడు. సాక్ష్యాలను మాయం చేయడానికి ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి సముద్రంలో పారేశాడు.

ఇది కూడా చదవండి: 13 ఏళ్ల బాలుడి ప్రాణం తీసిన న్యూడిల్స్.. ఈ విషయం తెలిస్తే ఇంకోసారి చచ్చినా తినరు!

ఆగస్టు 30న ఈద్గా జుగ్గి-జోపాడి ప్రాంతంలో ఒక మహిళ యొక్క తల మాత్రమే లభించడంతో కేసు దర్యాప్తు ప్రారంభమైంది. విచారణలో ఆ తల ముస్కాన్‌ది అని గుర్తించారు. ముస్కాన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణలో అసలు విషయం బయటపడింది. డిసిపి శశికాంత్ బొరాటే తెలిపిన వివరాల ప్రకారం.. తాహా మొదట కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించాడు. సెప్టెంబర్ 1న అతన్ని అరెస్ట్ చేసి విచారించగా.. తన నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా సెప్టెంబర్ 11 వరకు పోలీసు కస్టడీకి పంపింది. ప్రస్తుతం పోలీసులు హత్యకు ఉపయోగించిన ఆయుధాలు మరియు శరీరంలోని మిగతా భాగాల కోసం డ్రోన్ కెమెరాలు, పడవలు, ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్ సహాయంతో గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఖమ్మంలో దారుణం.. మామ వేధింపులకు కోడలి బలి.. పడక సుఖం ఇవ్వాలంటూ..!

Advertisment
తాజా కథనాలు