Noodles: 13 ఏళ్ల బాలుడి ప్రాణం తీసిన న్యూడిల్స్.. ఈ విషయం తెలిస్తే ఇంకోసారి చచ్చినా తినరు!

ఈజిప్టులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆకలితో ఆతృతగా సగం ఉడికిన నూడుల్స్ తిన్న 13 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. తర్వాత అతనికి కడుపునొప్పి, వాంతులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

New Update
Noodles

Noodles

నూడుల్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆహార పదార్థాలు. వీటిని గోధుమ పిండి, బియ్యం పిండి లేదా ఇతర రకాల పిండితో తయారు చేస్తారు. నూడుల్స్‌ను వివిధ దేశాల్లో వివిధ సంస్కృతుల్లో రకరకాలుగా వండుతారు. వీటిని ఉడకబెట్టి, వేయించి, లేదా సూపుల్లో కలిపి తింటారు. జపాన్‌లో రామెన్, ఇటలీలో పాస్తా, చైనాలో లో మెయిన్ వంటివి కొన్ని ప్రసిద్ధ నూడుల్స్ రకాలు. నూడుల్స్ తక్కువ సమయంలో త్వరగా తయారు చేసుకోవచ్చు. అందుకే ఇవి చాలా మందికి ఇష్టమైన ఆహారంగా మారాయి. అవి అన్ని రకాల వయసుల వారిని ఆకట్టుకుంటాయి. అయితే న్యూడుల్స్‌ తిని ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.  ఆ వార్త వైరల్‌గా మారింది. 

ప్రమాదకరమైన నూడుల్స్‌తో జాగ్రత్త..

ఈజిప్టులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆకలితో ఆతృతగా సగం ఉడికిన నూడుల్స్ తిన్న 13 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. సగం ఉడికిన నూడుల్స్ తింటే జీర్ణ సమస్యలు వస్తాయని.. ఒక్కోసారి అవి ప్రాణాలు కూడా తీస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల ఈజిప్టులో ఒక 13 ఏళ్ల బాలుడు ఆకలిగా ఉన్నప్పుడు ఒకటి కాదు.. ఏకంగా మూడు ప్యాకెట్ల నూడుల్స్‌ను ఉడకబెట్టకుండా తిన్నాడు. తర్వాత అతనికి కడుపునొప్పి, వాంతులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఇది కూడా చదవండి: ధ్వంసమైన పాక్ ఎయిర్ బేస్‌లో ఇప్పుడు ఏం జరుగుతోందో తెలుసా?

ఈ సంఘటన గురించి సామాజిక మాధ్యమాల్లో వార్త తెలియగానే.. అందరిలో ఆందోళన మొదలైంది. తక్షణ నూడుల్స్‌లో అధికంగా సోడియం ఉంటుందని.. ఇది అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. ఒక వ్యక్తికి రోజుకు 2000 మి.గ్రా సోడియం అవసరం. ఒక ప్యాకెట్ నూడుల్స్‌లోనే 1829 మి.గ్రా సోడియం ఉంటుంది. ఇది శరీరంలో ఎక్కువైనప్పుడు.. షుగర్, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని నిపుణులు హెచ్చరించారు. అంతేకాకుండా.. సగం ఉడికిన నూడుల్స్ జీర్ణ వ్యవస్థకు హాని కలిగిస్తుంది. ఫలితంగా.. శరీరంలోని నీరు తగ్గిపోయి డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. కావున నూడుల్స్‌ను సరైన రీతిలో ఉడకబెట్టి తగిన మోతాదులో తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: మరోసారి భారీ భూకంపం.. ఒకేసారి రెండు దేశాల్లో.. భయంతో ప్రజలు పరుగులు

Advertisment
తాజా కథనాలు