Samosa Fight: సంచలన వీడియో.. సమోసా కోసం గొడవ.. భర్తను పొట్టు పొట్టు కొట్టిన భార్య..!

ఉత్తరప్రదేశ్‌లో సమోసా కోసం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో భార్య పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టింది. ఆ సమయంలో తన ఫ్యామిలీతో కలిసి భర్తపై దారుణంగా దాడి చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశారు.

New Update
Wife and Husband Fight for samosa in uttar pradesh (1)

Wife and Husband Fight for samosa in uttar pradesh

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌ జిల్లాలోని ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. సమోసాల విషయంలో భార్య భర్తల మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. ఆ చిన్న వివాదం రక్తపాతంగా మారింది. భార్య, ఆమె బంధువులు భర్తను దారుణంగా కొట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Wife and Husband Samosa Fight

శివం అనే వ్యక్తి తన భార్య సంగీతతో కలిసి పిలిభిత్ జిల్లాలోని సెహ్రాపూర్ నార్త్ పోలీస్ స్టేషన్ ప్రాంతం ఆనంద్‌పూర్‌లో నివశిస్తున్నాడు. ఆగస్టు 30న సంగీత తన భర్తను సమోసాలు తీసుకురావాలని కోరింది. కానీ శివం వాటిని మర్చిపోయి ఇంటికి వచ్చాడు. ఈ చిన్న విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. 

ఆ చిన్న వాగ్వాదం తీవ్ర ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఇద్దరూ కాసేపు గట్టిగ గొడవ పడ్డారు. అనంతరం భార్య సంగీత కోపంతో మరుసటి రోజు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించింది. ఆగస్టు 30న గొడవ జరగగా.. ఆగస్టు 31న గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. మొదట్లో ఈ విషయం పరిష్కారం దిశగా సాగింది. కానీ అకస్మాత్తుగా పరిస్థితి మారిపోయింది. భార్య సంగీత, ఆమె తల్లి ఉష, తండ్రి రామ్‌లదతే, మామ రామ్‌తోతార్ కలిసి శివంపై ఒక్కసారిగా దాడి చేశారు. అతడిని నేలపై పడేసిన కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో పంచాయితీలో ఉన్న వ్యక్తులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఇంతలో కొందరు ఈ సంఘటనను వీడియో తీయడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

అనంతరం తన కొడుకును కొట్టడంపై బాధితుడు శివం తల్లి విజయ్ కుమారి ఎమోషనల్ అయ్యారు. తన కొడుకును పంచాయితీ మధ్యలో తన్నారని, పిడిగుద్దులతో దారుణంగా కొట్టారని ఆరోపించారు. ఆపై సెప్టెంబర్ 3న శివం తల్లి విజయ్ కుమారి ఖండగిరి పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేసినట్లు పురాన్‌పూర్ సర్కిల్ ఆఫీసర్ ప్రతీక్ దహియా తెలిపారు.

ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నలుగురు నిందితులపై BNS లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటనలో పాల్గొన్న నిందితులందరిపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. 

కాగా భార్యాభర్తల మధ్య చిన్న వివాదం పెద్ద గొడవ సృష్టించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు దేశవ్యాప్తంగా అనేక వింత కేసులు వెలుగులోకి వచ్చాయి. గతంలో మధ్యప్రదేశ్‌లోని టికమ్‌గఢ్ జిల్లాలో ఒక జంట మధ్య ఇంట్లో తయారుచేసిన మిరపకాయ చట్నీ విషయంలో వివాదం చెలరేగింది. చట్నీలో తక్కువ ఉప్పు కలిపారని భర్త ఆరోపించాడు. భార్యాభర్తల మధ్య గొడవ బాగా పెరిగి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చివరికి ఈ విషయం పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. ఆపై పంచాయతీ ద్వారా రాజీ కుదిరింది.

అదేవిధంగా ఇలాంటిదే మరొక ఘటన రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఒక భార్య తనకు కొత్త చెప్పులు కావాలని భర్తకు అడిగింది. కానీ భర్త అందుకు నిరాకరించాడు. దీంతో వారి ఇద్దరి మధ్య గొడవ చాలా పెరిగి పొట్టు పొట్టు కొట్టుకున్నారు. అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారు.

Advertisment
తాజా కథనాలు