Murder Case: కసాయి పనికి ఒడిగట్టిన కన్న తండ్రి.. ముగ్గురు పిల్లల్ని చంపి తాను కూడా చివరికి..

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం బోయలపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య గొడవ నలుగురు చావుకు కారమైంది. వారిలో ముగ్గురు పిల్లలు ఉండటం తీవ్ర విషాదం నింపింది. కుటుంబ కలహాల కారణంగా తండ్రి.. ముగ్గురు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు.

New Update
father crime in TG

Murder Case: ప్రకాశం(Prakasham) జిల్లా యర్రగొండపాలెం బోయలపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య గొడవ నలుగురి చావుకు కారమైంది. అందులో ముగ్గురు పిల్లలు ఉండటం స్థానికంగా తీవ్ర విషాదంగా నింపింది. కుటుంబ కలహాల కారణంగా ఓ తండ్రి.. ముగ్గురు పిల్లలను చంపి బలవన్మరణానికి పాల్పడ్డాడు(Three Children Murder Case). తండ్రి వెంకటేశ్వర్లు ముగ్గురు పిల్లలను చంపి ప్రాణాలు తీసుకున్నాడు.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలేం మండలం పెద్దబోయపల్లికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు, దీపిక దంపతులు. వీరికి మోక్షిత (8), వర్షిణి (6) ఇద్దరు కుమార్తెలు, శివధర్మ(4) ఓ కొడుకు ఉన్నారు. భార్యతో కలహాల నేపథ్యంలో ఆగస్ట్ 30న కుమార్తెలు, కుమారుడిని తీసుకుని వెంకటేశ్వర్లు శ్రీశైలం వెళ్లాడు. అక్కడి నుంచి అదేరోజు రాత్రి పిల్లలను తీసుకుని తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్‌కు వెళ్లాడు.

31న ఉప్పునుంతల మండలం సూర్యతండా సమీపంలో చిన్నకుమార్తె వర్షిణి, కుమారుడు శివధర్మపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత కల్వకుర్తి మండలం తాండ్ర సమీపంలో పెద్దకుమార్తె మోక్షితను కూడా అదే తరహాలో చంపేశాడు. అనంతరం కల్వకుర్తి పట్టణానికి వెళ్లి పురుగుల మందు కొనుక్కొని తాగాడు. వెల్దండ మండలం పెద్దాపుర్‌ శివారు బూరకుంట వద్ద బుధవారం ఉదయం వెంకటేశ్వర్లు మృతదేహం లభ్యమైంది. వెంకటేశ్వర్లు మృతదేహం లభ్యం కావడంతో అతడి సోదరుడు మల్లికార్జునరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెల్దండ ఎస్సై కురుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు చిన్నారుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. సీసీ కెమెరాలు పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయరహదారికి ఇరువైపులా ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగించాయి. ఈ క్రమంలో కాలిపోయిన స్థితిలో చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి.

కల్వకర్తి మండలం తాండ్ర దగ్గర పెద్ద కుమార్తె మోక్షిత మృతదేహం దొరికింది. శ్రీశైలం - హైదరాబాద్‌ రహదారి పక్కన సూర్యతండా సమీపంలో చిన్న కూతురు వర్షిణి, కొడుకు శివధర్మ డెడ్‌బాడీలు గుర్తించారు. ముగ్గురు పిల్లలను బైక్‌పై తీసుకువెళ్తున్నట్లు అచ్చంపేటలో సీసీ ఫుటేజ్‌ కూడా పోలీసులు గుర్తించారు. దిండి గ్రామ దగ్గర ఒక్క పాప మాత్రమే బైక్‌పై ఉన్నట్లు సీసీ ఫుటేజ్‌‌లో కనిపిస్తోంది. ముగ్గురు పిల్లలను పెట్రోల్ పోసి కాల్చివేయడంతో మృతదేహాలు గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు