Woman Jumps Off Roof: షాకింగ్ వీడియో.. భర్త మాటలు విని బిల్డింగ్ పైనుంచి దూకేసిన భార్య..!

UPలోని అలీఘర్ జిల్లాలో కట్నం వేధింపులు భరించలేక ఓ మహిళ ఇంటి డాబాపై నుంచి దూకింది. భర్త, అత్తింటివారు "దూకు" అని రెచ్చగొట్టడంతో ఆమె ఈ చర్యకు పాల్పడింది. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనపై పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Woman Jumps Off Roof

Woman Jumps Off Roof

Woman Jumps Off Roof: ఈ మధ్య కాలంలో భార్య భర్తల మధ్య మనస్పర్థాలు ఎక్కువైపోయాయి. చిన్న చిన్న విషయాలకే గొడవ పడి విడిపోతున్నారు. క్షణకావేశంలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ భర్త భార్యల మధ్య జరిగిన గొడవ సంచలనంగా మారింది. ఇరువురి మధ్య జరిగిన చిన్న వాగ్వాదంతో భార్య బిల్డింగ్ పైకి ఎక్కి దూకుతానని బెదిరించింది. దీంతో దమ్ముంటే కిందికి దూకు అంటూ భర్త పదే పదే అరవడంతో ఆమె దూకేసింది. అనంతరం తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలైంది. ఉత్తర ప్రదేశ్‌లోని అలీబాగ్ గోండా ఏరియా దాకౌలి గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: మోదీతో కారులో మాట్లాడిన సీక్రెట్ లీక్ చేసిన పుతిన్

Woman Jumps Off Roof

సోను - అర్చనకు ఆరు సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది. ఈ దంపతులకు నాలుగే, రెండు ఏళ్ల వయస్సు గల ఇద్దరు సంతానం. అయితే పెళ్లి సమయంలో అర్చన కుటుంబ సభ్యులు పెళ్లికొడుకు సోనూ ఫ్యామిలీకి దాదాపు రూ.10 లక్షలు ఇచ్చింది. అయినప్పటికీ అర్చన అత్తమామలు ఆ కట్నం పట్ల సంతోషంగా లేరు. దీంతో పెళ్లైన తర్వాత కూడా మరో రూ.5 లక్షలు ఇవ్వాలని.. దాంతో పాటు ఒక రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కూడా గిఫ్ట్‌గా ఇవ్వాలని వారు కోరారు. 

అర్చన ఫ్యామిలీ ఇవ్వలేకపోవడంతో తరచూ ఆమెను వేధిస్తూ ఉండేవారు(Wife Husband Incident ). ఇందులో భాగంగానే భర్త సోనూ భార్య అర్చన మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. తాజాగా మరోసారి వీరి ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో సోనూ తన భార్య అర్చనను కొట్టాడు. ఆమె ఏడుస్తూ బిల్డింగ్ పైకి ఎక్కి.. అక్కడి నుంచి దూకుతానని బెదిరించింది. అదే సమయంలో దమ్ముంటే కిందికి దూకి చావు అని భర్త అనడంతో ఆమె అన్నంత పని చేసింది. 

Also Read: 13 ఏళ్ల బాలుడి ప్రాణం తీసిన న్యూడిల్స్.. ఈ విషయం తెలిస్తే ఇంకోసారి చచ్చినా తినరు!

ఒక్కసారిగా ధైర్యం తెచ్చుకుని అమాంతంగా బిల్గింగ్ పై నుంచి కిందికి దూకేసింది. అయితే ఆమె కింద పడిన తర్వాత కూడా భర్త సోనూ ఆమెపై దాడి చేయడం గమనార్హం. అందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి తన మొబైల్‌లో రికార్డు చేయడంతో ఈ వ్యవహారం బయటకొచ్చింది. ప్రమాదవశాత్తు ఆమె ప్రాణాపాయ స్థితి నుంచి తీవ్ర గాయాలతో బటయపడింది. 

Also Read: ఆదివారం ఆకాశంలో అద్భుతం.. ఆ రోజు రక్తంతో నిండిన చంద్రుడు!!

అనంతరం అర్చన సోదరుడు అంకిత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కట్నం డిమాండ్ కారణంగా అర్చనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని ఆమె కుటుంబం తెలిపింది. సెప్టెంబర్ 1న తన సోదరి అత్తమామలు తన చెల్లెళ్ల పిల్లలను చంపేస్తామని బెదిరించారని తెలిపాడు. తన చెల్లి ఇంటి పైకప్పు నుండి దూకుతానని చెప్పినపుడు.. వారు ఆమెను మరింత రెచ్చగొట్టారని అన్నాడు. పొరుగువాడు వీడియో తీసి తమకు పంపడంతో ఈ విషయం తెలుసుకున్నామని తెలిపాడు. తన చెల్లెలి అత్తమామలు ఆమెను మానసికంగా హింసించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అనంతరం బాధితురాలు అర్చన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisment
తాజా కథనాలు