/rtv/media/media_files/2025/09/04/khammam-crime-news-2025-09-04-16-38-50.jpg)
Khammam Crime News
మహిళలపై వేధింపులు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సమస్యగా మారింది. ఇది శారీరక, మానసిక, లైంగిక, ఆర్థిక హింసతో కూడుకున్నది. గృహ హింస, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, సైబర్ వేధింపులు, అక్రమ రవాణా, పని ప్రదేశాల్లో వేధింపులు వంటివి మహిళల హక్కులకు భంగం కలిగిస్తున్నాయి. ఈ సమస్య వారి ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, సామాజిక జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. లింగ సమానత్వం సాధనకు, మహిళల రక్షణకు ఈ వేధింపులను అరికట్టడం అత్యవసరం. స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ సురక్షితంగా జీవించే సమాజం కోసం కలిసి కట్టుగా కృషి చేయాలని చెప్పిన ఏదో మూలన మహిళలు వేధింపులకు గురి అవుతున్నారు. తాజాగా తెలంగాణలో మామ వేధింపులు తాళలేక ఓ మహిళ ప్రాణాలు తీసుకుంది.కోరిక తీర్చాలంటూ వేధింపులు..
ఖమ్మం జిల్లాలోని శ్రీనివాస్ నగర్‌లో ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మామ వేధింపులు తాళలేక మోషిత (25) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస్ నగర్‌కు చెందిన నవీన్‌ను ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది మోషిత. అయితే గత కొన్ని నెలలుగా ఆమె మామ రామకృష్ణ వేధింపులు మొదలుపెట్టాడు. లైంగికంగా వేధించడంతో పాటు తన కోరికలు తీర్చకపోతే ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ విషయంపై గతంలో కుటుంబ పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా నిర్వహించారు. అయినప్పటికీ.. రామకృష్ణ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇది కూడా చదవండి: కసాయి పనికి ఒడిగట్టిన కన్న తండ్రి.. ముగ్గురు పిల్లల్ని చంపి తాను కూడా చివరికి..
నిత్యం కొనసాగుతున్న వేధింపులు, బెదిరింపులు మోషిత మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపాయి. వాటిని తట్టుకోలేక శుక్రవారం నాడు ఆమె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మోషిత తల్లి సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె ఆత్మహత్యకు మామ రామకృష్ణ వేధింపులే కారణమని.. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: 13 ఏళ్ల బాలుడి ప్రాణం తీసిన న్యూడిల్స్.. ఈ విషయం తెలిస్తే ఇంకోసారి చచ్చినా తినరు!