TG News: వివాహేతర సంబంధం .. రిసార్ట్‌లో బావ, మరదలు ఆత్మహత్య!
యాదాద్రి భువనగిరి జిల్లా రాగాల రిసార్ట్స్ లో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు చేసుకున్న వీరిద్దరూ బావ మరదలని తెలిసింది.
యాదాద్రి భువనగిరి జిల్లా రాగాల రిసార్ట్స్ లో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు చేసుకున్న వీరిద్దరూ బావ మరదలని తెలిసింది.
కొందరు యువతీ యువకులు ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విడిపోయి బ్రతకలేమని తనువులు చాలిస్తున్నారు. తాజాగా మరో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు సేవించి ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు.
పూర్ణ చందర్, స్వేచ్ఛ మధ్య ఉన్న సంబంధం తనకి తెలియదని స్వప్న తెలిపింది. స్వేచ్ఛ పూర్ణచందర్‌ను బ్లాక్ మెయిల్ చేసిందని, తన పిల్లలను కూడా అమ్మా అని పిలవాలని బెదిరించిందని వెల్లడించింది. తన భర్త నిర్దోషి, అమాయకుడు అని స్వప్న సంచలన కామెంట్స్ చేసింది.
తిరుపతి జిల్లా తిరుచానూరు రంగనాథం వీధిలో ఓ కారులో ఇద్దరి యువకుల డెడ్ బాడీలు కలకలం రేపుతున్నాయి. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని పాశమైలారం సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోవడంతో 10 మంది కార్మికులు స్పాట్లోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వివాహం చేసుకున్న మూడు నెలలకే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులోని తిరుప్పూర్‌లోని చోటుచేసుకుంది. భర్త, అత్త, మామలను పోలీసులు అరెస్టు చేశారు. రితన్య (27)కు, కవిన్ కుమార్ (28)తో పెళ్లి జరగగా అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధించడంతో పురుగుమందు తాగి రితన్య ఆత్మహత్య చేసుకుంది.
మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో చాక్లెట్ కొనడానికి నాలుగేళ్ల కూతురు తండ్రికి డబ్బులు అడిగింది. మద్యానికి బానిసైన ఆ తండ్రి తన నాలుగేళ్ల కూతురిని చీర కొంగుతో గొంతు కోసి అతి దారుణంగా చంపేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో భార్యపై కత్తితో దాడి చేసిన వ్యక్తి.. అడ్డొచ్చిన అత్తమామలనే నరికేశాడు. దీంతో వాళ్లు అక్కడికక్కడే మృతి చెందారు.
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. కురబలకోట మండలంలోని దొమ్మన్న బావీ వద్ద టెంపోను లారీ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు స్పాట్లోనే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే మదనపల్లె ఆసుపత్రికి తరలించారు.