/rtv/media/media_files/2025/07/07/arrest-2025-07-07-20-50-07.jpg)
pakistan spy network
Punjab: ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడితో సంబంధం ఉన్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్‌వర్క్‌ను గుర్తించే పనిలో పడిన అధికారులు ఎవరెవరికి సంబంధం ఉంది అనే కోణంలో ధర్యాప్తు చేస్తున్నారు. ఉగ్ర ముఠాతో సంబంధం ఉన్నవారు, ఉగ్ర మద్దతుదారులను గుర్తించి అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పాక్‌కు చెందిన నిఘా సంస్థ ఐఎస్‌ఐ కోసం గూఢచర్యం చేస్తున్నారన్న అనుమానంతో పంజాబ్‌లోని పఠాన్ కోట్‌కు చెందిన15 ఏళ్ల బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
జమ్మూలోని సాంబా జిల్లాకు చెందిన బాలుడు దాదాపు సంవత్సరకాలంగా ఐఎస్‌ఐ ఏజెంట్లతో సంబంధాలు కలిగి ఉంటూ.. భారత సైనిక స్థావరాలు, ఇతర సున్నితమైన సమాచారాన్ని వారికి చేర వేస్తున్నట్లు గుర్తించామన్నారు. అరెస్టు చేసిన బాలుడితో పాటు పంజాబ్‌కు చెందిన పలువురు మైనర్లకు కూడా ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.
ఈ విషయమై పంజాబ్‌లోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందజేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పాక్‌తో సంబంధాలు కొనసాగిస్తోన్న ఇతర బాలురను గుర్తించడానికి చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు. ఇందుకోసం పంజాబ్‌లోని మైనర్ల ఆన్‌లైన్ కార్యకలాపాలు, కదలికలపై దృష్టిసారించినట్లు తెలిపారు. భారత యువతను లక్ష్యం చేసుకోవడానికి పాక్ నిఘా సంస్థ పలు నకిలీ సోషల్ మీడియా ఖాతాలను నడుపుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. దేశాన్ని అస్థిరపరిచేందుకు, యువతలో భారత వ్యతిరేక కార్యకలాపాలను ప్రేరేపించేందుకు ఐఎస్ఐ ఏజెంట్లు సోషల్ మీడియా నెట్‌వర్క్ ద్వారా పని చేస్తున్నట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు.
Follow Us