Sabarimala temple: మరో అవినీతి స్కామ్.. 16 లక్షల విలువైన నెయ్యి మాయం

శబరిమల పుణ్యక్షేత్రంలో వరుస వివాదాలు భక్తులను కలవరపెడుతున్నాయి. ఆలయ ద్వారపాలకుల విగ్రహాల బంగారం చోరీ ఘటన మరువకముందే, తాజాగా అయ్యప్ప స్వామివారి 'నెయ్యాభిషేకం నెయ్యి' (ఆదియా శిష్టం నెయ్యి) విక్రయాల్లో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది.

New Update
Ghee packets

శబరిమల పుణ్యక్షేత్రంలో వరుస వివాదాలు భక్తులను కలవరపెడుతున్నాయి. ఆలయ ద్వారపాలకుల విగ్రహాల బంగారం చోరీ ఘటన మరువకముందే, తాజాగా అయ్యప్ప స్వామివారి 'నెయ్యాభిషేకం నెయ్యి' (ఆదియా శిష్టం నెయ్యి) విక్రయాల్లో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది.

16 లక్షల విలువైన నెయ్యి స్కామ్

శబరిమల అయ్యప్పకు నెయ్యాభిషేకం చేసిన అనంతరం మిగిలిన నెయ్యిని భక్తుల కోసం 100 మి.లీ. ప్యాకెట్లలో విక్రయిస్తారు. ఒక్కో ప్యాకెట్ ధర రూ.100గా నిర్ణయించారు. అయితే, ప్రస్తుత మండల పూజల సీజన్‌లో అమ్మకం కౌంటర్ల నుండి సుమారు 16 లక్షల రూపాయల విలువైన నెయ్యి ప్యాకెట్లు మాయమైనట్లు దేవస్థానం విజిలెన్స్ అధికారులు గుర్తించారు. సాధారణంగా ప్రత్యేక ఆలయ అధికారి ఈ స్టాక్‌ను విక్రయ కౌంటర్లకు అందజేస్తారు. అయితే, విజిలెన్స్ అధికారుల ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నెయ్యి ప్యాకెట్లను నింపడం, వాటి పంపిణీకి సంబంధించిన రికార్డుల్లో భారీగా అక్రమాలు జరిగాయి. భక్తులు కొనుగోలు చేసిన నెయ్యి ద్వారా వచ్చిన మొత్తాన్ని దేవస్థానం అధికారిక ఖాతాలో జమ చేయలేదని అధికారులు నిర్ధారించారు.

విజిలెన్స్ దర్యాప్తు 

ఈ కుంభకోణాన్ని బయటకు పొక్కకుండా గుట్టుగా ఉంచేందుకు కొందరు ప్రయత్నించినప్పటికీ, విజిలెన్స్ విభాగం దీన్ని లోతుగా విచారణ చేసింది. ఈ ఘటనపై శబరిమల దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్పందిస్తూ, నెయ్యి ప్యాకెట్లు మాయమైనట్లు సమాచారం అందిన వెంటనే విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దర్యాప్తులో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. వరుసగా జరుగుతున్న ఇటువంటి ఘటనలు శబరిమల ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తున్నాయని, పాలనా యంత్రాంగంలో లోపాలను ఎత్తిచూపుతున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు