/rtv/media/media_files/2026/01/06/fotojet-84-2026-01-06-14-28-05.jpg)
Falcon MD Amardeep arrested
Falcon Scam : ఫాల్కన్ ఎండీ అమర్‌దీప్‌ను తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబయిలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. డిజిటల్ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్లు కొట్టేసిన అమర్ దీప్ దుబాయ్ పారిపోయాడు. దీంతో ఆయనపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో గల్ఫ్ నుంచి ఆయన ముంబయికి చేరుకోవడంతో విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమానశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అదుపులోకి తీసుకున్నారు.
డిజిటల్ డిపాజిట్ల పేరిట అమర్‌దీప్ రూ.850 కోట్లు వసూలు చేసినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. యాప్ ఆధారిత డిపాజిట్లతో ఫాల్కన్ సంస్థ భారీ కుంభకోణానికి తెరతీసినట్లు అధికారులు వెల్లడించారు. షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో ప్రజలను అమర్‌మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్కామ్ వెలుగులోకి రాగానే అమర్‌దీప్ దంపతులు దుబాయ్‌కి పారిపోయారు. ఈ కేసులో ఇప్పటికే సీఈవో, అమర్‌దీప్ సోదరుడిని అధికారులు అరెస్ట్ చేశారు. గల్ఫ్ నుంచి ముంబైకి వచ్చిన అమర్ దీప్‌ను పోలీసులు పట్టుకున్నారు. ముంబై ఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారంతో ఫాల్కన్ ఎండీని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎమ్‌ఎన్‌సీ కంపెనీలో పెట్టుబడుల పేరుతో అమర్‌దీప్ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో బయటపడింది. యాప్ బేసిడ్ డిజిటల్ డిపాజిట్ల పేరుతో అమర్ దీప్ స్కామ్‌కు పాల్పడినట్లు తేలింది. అంతేకాకుండా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతానంటూ బురిడీ కొట్టించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఫాల్కన్ స్కామ్ వెలుగులోకి రాగానే అమర్ దీప్ దంపతులు చార్టెడ్ ఫ్లైట్‌లో దుబాయ్‌కు పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే సీఈఓతో పాటు అమర్ దీప్ సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమర్ దీప్ కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టగా.. ఎట్టకేలకు ముంబైలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Follow Us