/rtv/media/media_files/2026/01/05/indian-woman-found-dead-with-stab-wounds-in-us-apartment-2026-01-05-07-28-20.jpg)
Indian woman found dead with stab wounds in US apartment
అమెరికా(america) లోని కొలంబియా(Columbia) లో 27 ఏళ్ల నికిత గొడిశాల అనే NRI యువతి(NRI WOMAN) అనుమానస్పద స్థితిలో హత్యకు గురవ్వడం కలకలం రేపింది. తన మాజీ ప్రియుడి అపార్ట్‌మెంట్‌లో ఆమె విగతజీవిగా పడిఉంది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆమె ప్రియుడు అంతకుముందు దేశం విడిచి పారిపోయాడు. అయితే పారిపోవడానికి ముందే నికిత కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.
Also Read: ప్రియాంక గాంధీకి హైకమాండ్ కీలక బాధ్యతలు
Indian Woman Found Dead In US Apartment
అయితే కొత్త ఏడాది వేడుకల తర్వాతి నుంచి ఆమె కనిపించడం లేదు. ఆ తర్వాత ఆమె ప్రియుడు అర్జున్ శర్మ (26) నికిత కనిపించడం లేదని పోలీసులకు చెప్పాడు. తాను చివరిసారిగా ఆమెను ఎల్లికాట్ సిటీలో డిసెంబర్ 31న చూశానన్నాడు. అది అతడు ఉంటున్న అపార్ట్‌మెంటే. జనవరి 2న అతడు ఇండియాకు పారిపోయిట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత అధికారులు సెర్చ్ వారెంటు జారీ చేశారు. చివరికి అతడి అపార్ట్‌మెంటును సెర్చ్ చేయగా నికిత మృతదేహం దొరికింది.
Also read: నైజీరియాలో మారణహోమం.. 30 మంది మృతి, గ్రామస్థుల కిడ్నాప్
నికిత శరీరంపై గాయాలు కూడా ఉన్నాయి. దీనిపై విచారణ చేయగా డిసెంబర్ 31న రాత్రి తర్వాత ఆమె మాజీ ప్రియుడైన అర్జున్ హత్య చేసినట్లు స్పష్టమయ్యింది. కానీ అతడు ఎందుకు హత్య చేశాడనే దానిపై క్లారిటీ లేదు. భారత్‌కు పారిపోయిన అర్జున్‌ను గుర్తించేందుకు పోలీసులు ఫెడరల్ అధికారులు సాయం కోరారు. అలాగే నికిత స్నేహితులు కూడా ఆమె కోసం గాలించారు. చివరికి ఆమె హత్యకు గురైందని తెలియడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Follow Us