Ankush Bhardwaj: మైన‌ర్ అథ్లెట్‌పై లైంగిక వేధింపులు.. జాతీయ షూటింగ్ కోచ్‌పై కేసు ఫైల్

నేషనల్ షూటింగ్ కోచ్‌ అంకుశ్‌ భరద్వాజ్‌ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు 17 ఏళ్ల మైనర్ షూటర్ హర్యానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఫరీదాబాద్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదైంది.

New Update
National shooting coach

నేషనల్ షూటింగ్ కోచ్‌(National Shooting Coach) అంకుశ్‌ భరద్వాజ్‌(Ankush Bharadwaj) తనపై లైంగిక దాడి(sexually assaulting) కి పాల్పడినట్లు 17 ఏళ్ల మైనర్(minor-girl) షూటర్ హర్యానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఫరీదాబాద్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు(Pocso case) నమోదైంది. న్యూఢిల్లీలోని డాక్టర్‌ కర్ణి సింగ్‌ షూటింగ్‌ రేంజ్‌లో జాతీయ స్థాయి పోటీలు జరుగుతున్న సమయంలో ఈ అఘాయిత్యం చోటుచేసుకున్నట్లు బాధితురాలు పేర్కొంది. పోటీల్లో ఆమె పర్ఫామెన్స్ చూస్తానని చెప్పి అంకుశ్‌ భరద్వాజ్, తొలుత హోటల్ లాబీలో తనను కలవాలని ఆదేశించాడు. ఆ తర్వాత బలవంతంగా రూమ్‌కు రప్పించి, ఫరీదాబాద్‌లోని ఒక హోటల్‌లో తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది.

నిందితుడు కేవలం అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా, బాధితురాలిని తీవ్రంగా భయపెట్టినట్లు తెలుస్తోంది. "నేను చెప్పినట్లు వినకపోయినా, ఈ విషయం బయటపెట్టినా నీ కెరీర్‌ను నాశనం చేస్తాను.. నీ కుటుంబాన్ని కూడా వదిలిపెట్టను" అని అంకుశ్‌ తనను బెదిరించాడని సదరు క్రీడాకారిణి ఫిర్యాదులో పేర్కొంది. ఘటన జరిగిన వెంటనే తీవ్ర భయాందోళనకు గురైన ఆమె హోటల్ నుంచి వెళ్ళిపోయింది. ఇంటికి చేరుకున్నాక కుటుంబ సభ్యులు ఆరా తీయడంతో అసలు విషయం బయటపెట్టింది.

ఈ ఘటనపై ఫరీదాబాద్ పోలీసులు స్పందిస్తూ.. కేసును అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. మంగళవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు, ఘటన జరిగిన రోజుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను సేకరిస్తున్నారు. హోటల్ అధికారుల నుంచి మరిన్ని వివరాలు కోరామని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తనతో పాటు మరో మహిళా షూటర్‌ను కూడా అంకుశ్‌ ఇబ్బంది పెట్టినట్లు బాధితురాలు వెల్లడించడం గమనార్హం.

Also Read :  దారుణం.. రూ.3 లక్షలకు గిరిజన యువతి అమ్మకం

సస్పెన్షన్‌ వేటు వేసిన NRAI

నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (NRAI) నియమించిన 13 మంది జాతీయ కోచ్‌లలో అంకుశ్‌ ఒకడు. ఈ విషయం మీడియా ద్వారా తమ దృష్టికి వచ్చిందని NRAI సెక్రటరీ జనరల్‌ పవన్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. విచారణ పూర్తయ్యే వరకు అంకుశ్‌ను విధుల నుంచి తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. క్రీడాకారుల రక్షణకు తాము కట్టుబడి ఉన్నామని, నిందితుడికి ఇకపై ఎలాంటి బాధ్యతలు అప్పగించబోమని స్పష్టం చేశారు.

Also Read :  2వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వీధి కుక్క.. శాంతి యాత్రలో అలోక స్పెషాలిటీ!

Advertisment
తాజా కథనాలు