BREAKING: అమెరికా ఉపాధ్యక్షుడు ఇంటిపై కాల్పులు.. JD వాన్స్‌కు తప్పిన ప్రమాదం!

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఇంటిపై కాల్పులు కలకలం రేపాయి. సోమవారం తెల్లవారుజామున ఒహియోలోని సిన్సినాటిలో ఉన్న ఆయన జేడీ వాన్స్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇంటికి కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి.

New Update
US Vice President JD Vance

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఇంటిపై కాల్పులు కలకలం రేపాయి. సోమవారం తెల్లవారుజామున ఒహియోలోని సిన్సినాటిలో ఉన్న ఆయన జేడీ వాన్స్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇంటికి కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, సీక్రెట్ సర్వీస్ అధికారులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.

యూఎస్ స్థానిక కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత (సుమారు 12:15 గంటలకు) ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తి అమెరికా ఉపాధ్యక్షుడి ఇంటి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతూ, కిటికీలపై దాడులు చేస్తున్నట్లు అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు గుర్తించారు. ఆ వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించగా, స్థానిక పోలీసుల సాయంతో భద్రతా దళాలు అతడిని వెంబడించి పట్టుకున్నాయి. నిందితుడు ఇంటిపై కాల్పులు జరిపినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, దీనివల్లనే కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయని సమాచారం. అయితే, ఈ విషయాన్ని అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

తప్పిన పెను ప్రమాదం  

అదృష్టవశాత్తూ, ఈ దాడి జరిగిన సమయంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ ఇంట్లో లేరు. సెలవులపై గత వారం ఇంటికి వచ్చిన వాన్స్, ఆదివారం మధ్యాహ్నమే వాషింగ్టన్ డీసీకి బయలుదేరి వెళ్లారు. ఆయన వెళ్లిన కొన్ని గంటల్లోనే ఈ దాడి జరగడం గమనార్హం. సాధారణంగా వాన్స్ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ప్రాంతమంతా ఫుల్ సెక్యురిటీ ఉంటుంది. ఆయన వెళ్లిన తర్వాత బారికేడ్లను తొలగించిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది.

అదుపులోకి తీసుకున్న వ్యక్తి వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ఆ వ్యక్తి ఎందుకు దాడి చేశాడు? అతడి వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? అన్న కోణంలో సిన్సినాటి పోలీసులు, FBI విచారణ జరుపుతున్నాయి. ఉపాధ్యక్షుడి భార్య ఉషా చిలుకూరి వాన్స్‌పై గతంలో జరిగిన జాత్యహంకార వ్యాఖ్యల నేపథ్యంలో, ఈ దాడి వెనుక ఏదైనా విద్వేషపూరిత కోణం ఉందా అన్నది కూడా పరిశీలిస్తున్నారు.

ప్రస్తుతం వాన్స్ నివాసం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత, అమెరికాలో కీలక నేతల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisment
తాజా కథనాలు