TG Crime: హైదరాబాద్‌లో దారుణం.. సూట్‌కేస్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం
హైదరాబాద్‌లోని బాచుపల్లి పీఎస్ పరిధిలో సూట్‌కేసులో మహిళా మృతదేహం కలకలం రేపింది. నిర్మానుష్య ప్రాంతంలో సూట్ కేసు నుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.