Big breaking:   నెల్లూరులో జంట హత్యలు.. రంగంలోకి పోలీసు జాగిలాలు

నెల్లూరు నగరంలో జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. రంగనాయకులపేట గుడి సమీపంలోని తిక్కన పార్కు‌ ప్రాంతంలో వారధి జాఫర్ సాహెబ్ కాలువ వద్ద ఇద్దరు యువకలను దారుణంగా హత్య చేశారు. యువకులను  హత్య చేసి మృత దేహాలను కాలువలో పడేశారు.

New Update
Twin murders in Nellore.. Police on the scene

Twin murders in Nellore.. Police on the scene

Nellore Murders:  నెల్లూరు నగరంలో జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. రంగనాయకులపేట గుడి సమీపంలోని తిక్కన పార్కు‌ ప్రాంతంలో వారధి జాఫర్ సాహెబ్ కాలువ వద్ద ఇద్దరు యువకలను దారుణంగా హత్య చేశారు. యువకులను  హత్య చేసి మృత దేహాలను కాలువలో పడేశారు.అటుగా వెళ్తున్న స్థానికులు మృతదేహాలను చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రైమ్ స్పాట్‌ను పరిశీలించారు. ఇద్దరు యువకులను దుండగులు కర్రలతో కొట్టిచంపి, పెన్నానదిలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా డి.ఎస్.పి సింధుప్రియ సంఘటన స్థలానికి చేరుకున్నారు.

 
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు యువకులను గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో కొట్టి హత్య చేసినట్లు తెలుస్తుందన్నారు. సంఘటన‌ స్థలంలో విరిగిన కర్రలు, రక్తపు మరకలు గుర్తించినట్లు తెలిపారు. గ్రూపుల మధ్య పాతకక్ష్యల కారణంగానే వారిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా కాలువలో పడేసిన మృతదేహాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పటికే ఒకరి మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు వారిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా మద్యం, గంజాయి సేవించిన గ్యాంగుల మధ్య ఘర్షణ మూలంగానే ఈ హత్యలు జరిగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా రంగంలోకి జాగిలాలను దించిన పోలీసులు పరిసరాలను పరీక్షిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read: Bigg Boss Promo: రేలంగి మావయ్య బయటకొచ్చాడు.. భరణికి ఇచ్చి పడేసిన శ్రీజ..! హై వోల్టేజ్ ఎపిసోడ్

Advertisment
తాజా కథనాలు