/rtv/media/media_files/2025/10/07/ap-crime-2025-10-07-13-05-20.jpg)
Visakhapatnam Crime News
ఏపీలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. రూ.3 లక్షలు అప్పు చేసి కొనిచ్చిన కొత్త బైక్, సరిగ్గా మూడు రోజులకే ఆ యువకుడి ప్రాణాలు తీసింది. కన్నబిడ్డ కోరిక తీర్చామని సంతోషించిన ఆ తల్లిదండ్రులకు ఈ దుర్ఘటన తీరని కడుపుకోతను మిగిల్చింది. విశాఖపట్నంలోని సిరిపురం వద్ద ఆదివారం అర్ధరాత్రి ఈ విషాదకర ఘటన జరిగింది. మహారాణిపేటకు చెందిన ఆటో డ్రైవర్ శ్రీనివాసరావు కుమారుడు హరీష్ (19) బైక్ కావాలంటూ తల్లిదండ్రులపై పదే పదే ఒత్తిడి తెచ్చాడు. దీంతో కుమారుడి కోరిక తీర్చడానికి శ్రీనివాసరావు రూ.3 లక్షలు అప్పు చేసి మరీ దసరా పండుగ రోజున హరీష్‌కు కొత్త బైక్‌ను కొనిచ్చాడు.
కన్నవారికి కడుపుకోత..
దసరా రోజు 3 లక్షలు అప్పు చేసి బైక్ కొనిచ్చిన తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన కుమారుడు
— Volga Times (@Volganews_) October 7, 2025
విశాఖపట్నం - మహారాణిపేటలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ శ్రీనివాసరావు కుమారుడు హరీష్ (19) ఇంటర్ వరకు చదివి ప్రస్తుతం ఖాళీగా ఉండగా.. ఇటీవల బైక్ కావాలని అడిగితే డబ్బుల్లేవని చెప్పిన తండ్రి… pic.twitter.com/EH3lWck6I1
ఇది కూడా చదవండి: హైదరాబాద్ రెస్టారెంట్‌లో ఫుడ్ పాయిజన్.. 8 మందికి సీరియస్!
ఆదివారం అర్ధరాత్రి హరీష్ టిఫిన్ తినడానికి బయటకు వెళ్లాడు. సిరిపురం వద్ద అతివేగంగా నడుపుతున్న బైక్ అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హరీష్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కొడుకు సంతోషం కోసం అప్పు చేసిన తల్లిదండ్రులు, అతడు విగతజీవిగా మారిన వార్త విని కన్నీరుమున్నీరయ్యారు. కొడుకు పోవడంతో ఆ ఇంట విషాదం అలుముకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న త్రీటౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతివేగంగా వాహనాలు నడప వద్దని యువతను పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో మరో దారుణం.. అలా చేస్తోందని అత్తను కొట్టి చంపిన కోడలు!