BIG BREAKING: 15 మంది టూరిస్టులు మృతి

హిమాచల్ ప్రదేశ్‌లో తీవ్ర విషాదాన్ని చోటుచేసుకుంది. నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బిలాస్‌పూర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల బస్సు మీద పడటంతో 15 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.

New Update
BREAKING

BREAKING

హిమాచల్ ప్రదేశ్‌లో మంగళవారం తీవ్ర విషాదాన్ని చోటుచేసుకుంది. నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బిలాస్‌పూర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ శిథిలాలు బస్సు మీద పడటంతో 15 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.

బిలాస్‌పూర్-మండీ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు మార్గమధ్యలో ఉండగా ఒక్కసారిగా కొండ పైనుంచి పెద్దపెద్ద బండరాళ్లు, మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది టూరిస్టులు చనిపోయారు.

సమాచారం అందుకున్న వెంటనే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) మరియు స్థానిక పోలీసు సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. శిథిలాలను తొలగించి, బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు 15 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు ధృవీకరించారు.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన మరికొందరిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్డును పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొండ ప్రాంతాల్లో ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని స్థానిక ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisment
తాజా కథనాలు