TG Crime: తెలంగాణలో ఘోరం.. ఇంటర్ బాలికను రేప్ చేసి చంపేశారు!

నల్లగొండలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న  మైనర్ బాలికను రేప్ చేసి హతమార్చాడు ఓ యువకుడు. అన్నరెడ్డి గూడెంకు చెందిన 17ఏళ్ల బాలిక డైట్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది.

New Update
rape

TG Crime: నల్లగొండలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న  మైనర్ బాలికను రేప్ చేసి హతమార్చాడు ఓ యువకుడు. అన్నరెడ్డి గూడెంకు చెందిన 17ఏళ్ల బాలిక డైట్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. ఈ క్రమంలోనే టాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న గుట్ట కింద అన్నారంకు చెందిన గడ్డం కృష్ణతో పరిచయం  ఏర్పడింది. ఆరు నెలలుగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. 

Also Read :  రచ్చ రంబోలా.. Samsung ఫోన్‌పై రూ.13వేల భారీ తగ్గింపు - ఫ్లిప్‌కార్ట్‌ కొత్త సేల్‌ అదిరింది..!

రేప్ చేసి హత్య..

అయితే ఇదే చనువుతో కళాశాలకు వెళ్తున్న ప్రయేసిని సోమవారం ఉదయం 8:30కి స్నేహితుడి రూమ్‌కి తీసుకెళ్లాడు కృష్ణ. శమ్స్‌నగర్ రోడ్ నెం.8 వద్ద వాటర్ ట్యాంక్ పక్కనే కిరాయి గదిలో ఉదయం 9 గంటలకు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఇద్దరిమధ్య వివాదం చోటుచేసుకోగా బాలికను అక్కడే చంపేశాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి వెళ్లిన DSP శివరాం రెడ్డి.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. అయితే ఒక్కడే ఈ దారుణానికి పాల్పడ్డాడా? లేక ఇంకెవరైనా సహాయం చేశారా అనే వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. 

Also Read: Bigg Boss Promo: రేలంగి మావయ్య బయటకొచ్చాడు.. భరణికి ఇచ్చి పడేసిన శ్రీజ..! హై వోల్టేజ్ ఎపిసోడ్

యువకుల మర్డర్..

ఇదిలా ఉంటే.. నెల్లూరు నగరంలో జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. రంగనాయకులపేట గుడి సమీపంలోని తిక్కన పార్కు‌ ప్రాంతంలో వారధి జాఫర్ సాహెబ్ కాలువ వద్ద ఇద్దరు యువకలను దారుణంగా హత్య చేశారు. యువకులను  హత్య చేసి మృత దేహాలను కాలువలో పడేశారు.అటుగా వెళ్తున్న స్థానికులు మృతదేహాలను చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రైమ్ స్పాట్‌ను పరిశీలించారు. ఇద్దరు యువకులను దుండగులు కర్రలతో కొట్టిచంపి, పెన్నానదిలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా డి.ఎస్.పి సింధుప్రియ సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు యువకులను గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో కొట్టి హత్య చేసినట్లు తెలుస్తుందన్నారు. సంఘటన‌ స్థలంలో విరిగిన కర్రలు, రక్తపు మరకలు గుర్తించినట్లు తెలిపారు. గ్రూపుల మధ్య పాతకక్ష్యల కారణంగానే వారిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: India-Pakistan: 4 లక్షల మంది మహిళలపై లైంగిక వేధింపులు.. పాక్ సైన్యం దుర్మార్గాలను బయటపెట్టిన భారత్! 

Advertisment
తాజా కథనాలు