Ap Crime : ఏపీలో ఘోరం.. చెల్లిని పెళ్లి చేసుకున్నాడని చంపేశాడు!

గుంటూరు జిల్లా ఏటుకూరులో దారుణం జరిగింది.  చెల్లిని పెళ్లి చేసుకున్న వ్యక్తి ప్రాణాలు తీశాడో అన్న.  పలకలూరుకు చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు గణేశ్‌. చెల్లిని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో ఫ్రెండ్స్‌తో కలిసి.. నడిరోడ్డుపైనే గణేశ్‌ ప్రాణాలు తీశాడు

New Update
ganesh guntur

గుంటూరు జిల్లా ఏటుకూరులో దారుణం జరిగింది.  చెల్లిని పెళ్లి చేసుకున్న వ్యక్తి ప్రాణాలు తీశాడో అన్న.  పలకలూరుకు చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు గణేశ్‌. చెల్లిని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో ఫ్రెండ్స్‌తో కలిసి.. నడిరోడ్డుపైనే గణేశ్‌ ప్రాణాలు తీశాడు యువతి సోదరుడు.  విచక్షణరహితంగా గణేశ్‌ పై దాడి చేసి ప్రాణం తీశారు ముగ్గురు యువకులు.  పెళ్లి తరువాత రక్షణ కోరుతూ గతంలో గుంటూరులోని నల్లపాడు పోలీసులను ఆశ్రయించాడు గణేష్. అప్పట్లో పోలీసులు ఇరుకుటుంబాలను పిలిచి మాట్లాడారు. అయితే అంత సద్దుమణిగిందని అనుకున్న టైమ్ లో తమ కుమారుడిని దారుణంగా కత్తులతో పొడిచి చంపారని గణేశ్‌ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

యువకుల మర్డర్..

ఇదిలా ఉంటే.. నెల్లూరు నగరంలో జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. రంగనాయకులపేట గుడి సమీపంలోని తిక్కన పార్కు‌ ప్రాంతంలో వారధి జాఫర్ సాహెబ్ కాలువ వద్ద ఇద్దరు యువకలను దారుణంగా హత్య చేశారు. యువకులను  హత్య చేసి మృత దేహాలను కాలువలో పడేశారు.అటుగా వెళ్తున్న స్థానికులు మృతదేహాలను చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రైమ్ స్పాట్‌ను పరిశీలించారు. ఇద్దరు యువకులను దుండగులు కర్రలతో కొట్టిచంపి, పెన్నానదిలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా డి.ఎస్.పి సింధుప్రియ సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు యువకులను గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో కొట్టి హత్య చేసినట్లు తెలుస్తుందన్నారు. సంఘటన‌ స్థలంలో విరిగిన కర్రలు, రక్తపు మరకలు గుర్తించినట్లు తెలిపారు. గ్రూపుల మధ్య పాతకక్ష్యల కారణంగానే వారిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు