🔴LIVE BREAKINGS: 11A సీటు మిస్టరీ.. విమాన ప్రమాదంలో ఒకడు కాదు ఇద్దరు బతికారు
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
హైదరాబాద్‌లో సనత్‌నగర్ పోలీస్ స్టేషన్లో పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తాను ఉంటున్న అపార్ట్‌మెట్ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం 8.30 గంటలకు ఈ ఘటన జరిగింది.
నిత్యం అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో హింసను తగ్గించేందుకు పోలీసులు స్పెషల్ ఆఫరేషన్ నిర్వహించారు.ఈ ఆఫరేషన్లో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో అత్యాధునిక ఆయుధాలతో పాటు 400 లకు పైగా వివిధ రకాల ఆయుధాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణీ మరణించిన విషయం తెలిసిందే. ఆయితే లండన్ వెళ్లేందుకు ఆయన రెండుసార్లు టికెట్ బుక్ చేసుకుని ఆ తర్వాత రద్దు చేసుకున్నారు. కానీ మూడోసారి లండన్ వెళుతూ విమాన ప్రమాదంలో మరణించారు.
నీట్ యూజీ (NEET UG 2025) ఫలితాలు విడుదలయ్యాయి. ఇదిలా ఉండగానే ముంబైలో నీట్ స్కోర్ బాగోతం వెలుగు చూసింది. నీట్ స్కోర్లను తారుమారు చేసి అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఇద్దరినీ సీబీఐ అరెస్ట్ చేసింది.
అనంతపురం జిల్లా పుట్లూరులో దారుణం చోటు చేసుకుంది. సొంత తమ్ముణ్ణి వేట కొడవలితో గొంతు కోసి, నరికి హత్య చేశాడు అన్న. ఇల్లుని తనపేరుపై రిజిస్టర్ చేయించాలని గొడవ పడడంతో సొంత అన్న ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా మర్రిగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుండి ఇల్లందుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న సిమెంట్ లోడ్‌తో కూడిన యాష్ ట్యాంకర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆర్టీసీ కండక్టర్ సహా కనీసం పది మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో టీ స్టాల్ వద్ద నిద్రిస్తున్న 16 ఏళ్ల ఆకాష్ మంటల్లో చిక్కుకుని మరణించాడు. ప్రమాదం సమయంలో అతని తల్లి సీతాబెన్ టీ చేస్తోంది. తన కొడుకు మంటలతో కాలిపోతుండటంతో అతన్ని కాపాడటానికి ప్రయత్నించింది. కానీ ఫలితం లేకపోయింది.
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 274కి చేరింది. మొదట 265 మంది చనిపోయినట్లు నిర్ధారించగా తాజాగా మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. బీజే మెడికల్ కాలేజీకి చెందిన 33 మంది చనిపోయారు. ప్రమాదం జరగగానే 24మంది.. చికిత్స పొందుతూ మరో 9 మంది మరణించారు.