Husband Kills Wife: వీడేం భర్త.. భార్య తలపై సుత్తితో కొట్టి చంపేశాడు.. తర్వాత ఏమైందంటే?

యూపీలోని ఉన్నావ్ జిల్లాలో దారుణం జరిగింది. గంగాఘాట్ పరిధిలోని లాల్తాఖేడా గ్రామంలో రాజేష్ లోధి తన భార్య సీమ లోధిని సుత్తితో కొట్టి హత్య చేశాడు. మరుసటి రోజు రాజేష్ అడవిలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

New Update
UP Unnao Murder

UP Unnao Murder

ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh) లో ఇటీవల కాలంలో భార్యను హత్య(Husband Ki*ll*s Wife) చేసిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. రీసెంట్ గా మీరట్‌లోని కంకర్ఖేడా ప్రాంతంలో ఏడు నెలల గర్భిణి అయిన తన భార్య సప్నను (25) ఆమె భర్త రవిశంకర్ (30) దారుణంగా హత్య చేశాడు. రవిశంకర్ తన భార్య సప్నను గదిలో బంధించి కత్తితో గొంతు కోసి పొడిచి చంపాడు. హత్య తర్వాత నిందితుడే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. వివాహ విభేదాల కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానించారు. అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని, కలకలాన్ని సృష్టించింది. ఇది మరువక ముందే ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. 

Also Read :  కపిల్ శర్మకు మరోసారి షాక్‌.. రెస్టారెంట్‌పై మూడోసారి కాల్పులు..

UP Unnao Murder

గంగాఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్తాఖేడా గ్రామం వద్ద 32 ఏళ్ల రాజేష్ లోధి తన 28 ఏళ్ల భార్య సీమ లోధిని సుత్తితో తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన ఇప్పుడు సంచలనం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

రాజేష్ లోధి, సీమ లోధి దంపతులకు నలుగు, ఐదేళ్ల వయసు గల ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారు. వీరు మ్యారేజ్ అయిన కొత్తలో హ్యాపీగా ఉండేవారు. కానీ చిన్న చిన్నగా ఒకరిపై ఒకరికి మనస్ఫార్థాలు రావడం మొదలయ్యాయి. ఇలా తరచూ గొడవలు జరిగేవి. ఇందులో భాగంగానే అక్టోబర్ 15న మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త తీవ్ర రూపం దాల్చడంతో కోపగ్రస్తుడైన భర్త రాజేష్ తన భార్య సీమ లోధి తలపై సుత్తితో కొట్టి కొట్టి హత్య చేశాడు. 

హత్య అనంతరం రాజేష్ భార్య మరణం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. అనంతరం సీమ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడైన భర్త రాజేష్‌తో పాటు అత్తమామలు సహా ఆరుగురిపై వరకట్న వేధింపులు, హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసులో అత్తమామలను పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు పంపారు.

భార్యను హత్య చేసిన తర్వాత పరారీలో ఉన్న నిందితుడు రాజేష్ లోధి.. అక్టోబర్ 16న లాల్తాఖేడా గ్రామానికి సమీపంలోని అడవిలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపారు. ఈ హత్యకు వరకట్నం కాకుండా మరేదైనా కారణం ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ దారుణం ఆ గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టించింది. పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు.

Also Read :  భార్యకు అనారోగ్య సమస్యలు.. చెప్పకుండా పెళ్లి చేశారని..అనస్తీషియా ఇచ్చి...

Advertisment
తాజా కథనాలు