/rtv/media/media_files/2025/10/16/kapil-sharma-restaurant-targeted-for-the-third-time-2025-10-16-20-06-08.jpg)
Kapil Sharma's restaurant targeted for the third time
Bishnoi Gang : ప్రముఖ బాలీవుడ్ కమెడియన్, షో హోస్ట్ కపిల్ శర్మ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. ఆయన కెనడాలో ‘కప్స్ కేఫ్’ పేరిట ఓ రెస్టారెంట్ ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ రెస్టారెంట్‌ను లారెన్స్ బిష్ణోయ్ క్రిమినల్ గ్యాంగ్ టార్గెట్ చేసింది. ఆ గ్యాంగ్ సభ్యులు గత కొన్ని నెలలనుంచి రెస్టారెంట్‌పై తరచుగా కాల్పులకు తెగబడుతున్నారు. గురువారం తెల్లవారు జామున మరోసారి రెస్టారెంట్‌పై కాల్పులు జరిగాయి. గడచిన నాలుగు నెలల కాలంలో కాల్పలు జరగడం ఇది మూడో సారి.
Also Read: రెబల్ స్టార్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. 'పౌర్ణమి' 4K రీ రిలీజ్ బుకింగ్స్ ఓపెన్..!
“క్యాప్స్ కేఫ్” గురువారం తెల్లవారుజామున మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. కేఫ్ పై తొమ్మిది నుంచి పది రౌండ్ల బుల్లెట్లు పేలాయి. కాల్పుల్లో కేఫ్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. కాగా తామే కాల్పులు జరిపినట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. కాగా కపిల్ శర్మ కేఫ్ పై కాల్పులు జరగడం మూడవ సంఘటన. అయితే కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాడి చేసిన వ్యక్తి కారు లోపల నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సంవత్సరం జూలై 10న, ఆగస్టు 7న కపిల్ శర్మ కెనడియన్ కేఫ్ పై మొదటిసారి కాల్పులు జరిగాయి. రెండు సార్లు కూడా కేఫ్ అద్దాలు పగిలిపోయాయి. ఈ సంఘటనల తర్వాత, కేఫ్ చాలా రోజులు మూసివేశారు.
ఇది కూడా చూడండి: Konda Surekha: మంత్రి ఇంటి దగ్గర ఫుల్ డ్రామా...పోలీసుల ఎదురుగానే ఒకే కారులో వెళ్ళిన సురేఖ, సుమంత్
కాగా కారులో రెస్టారెంట్ దగ్గరకు వచ్చిన దుండగులు తుపాకితో కాల్పులకు తెగబడ్డారు. అది కూడా రాత్రి వేళల్లోనే కాల్పులు జరపడం గమనార్హం. దీన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులైన గ్యాంగ్‌స్టర్ గోల్డీ దిల్లాన్, కుల్దీప్ సిద్దు ఈ దాడి తామే చేసినట్లు ప్రకటించుకున్నారు. ఈ మేరకు కుల్దీప్ సోషల్ మీడియాలో ఓ పోస్టు కూడా పెట్టాడు. ఆ పోస్టులో.. ‘కప్స్ కేఫ్‌పై జరిగిన మూడు దాడులకు నేను, గోల్డీ దిల్లాన్ బాధ్యత వహిస్తున్నాము. మాకు ప్రజలతో ఎలాంటి శత్రుత్వం లేదు. మాతో శత్రుత్వం ఉన్న వ్యక్తులు మాకు చాలా దూరంగా ఉండాలి. తప్పుడు పనులు చేస్తూ, ప్రజలకు డబ్బులు ఇవ్వని వారు సిద్ధంగా ఉండాలి. బాలీవుడ్‌లో మా మతానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు కూడా సిద్ధంగా ఉండాలి. బుల్లెట్లు ఏ వైపునుంచైనా రావచ్చు’ అని వార్నింగ్ ఇచ్చాడు.
ఇది కూడా చూడండి: Mahabubnagar: ఛీ ఛీ.. మధ్యాహ్న భోజనం పప్పులో కప్ప.. పరుగులు తీసిన స్టూడెంట్స్