Karimnagar : భార్యకు సె*క్స్ పిచ్చి..  భర్తకు వయాగ్రా ఇచ్చి చచ్చేదాక దారుణంగా..

కరీంనగర్ లో దారుణం జరిగింది. డబ్బుల కోసం వేధిస్తున్నాడని కట్టుకున్న భర్తను కడతేర్చిందో ఇల్లాలు. ఈ ఘటనలో నిందితురాలితో పాటుగా మరో ఐగురుగురిని కరీంనగర్‌ టూటౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు.

New Update
karimnagar

కరీంనగర్ లో దారుణం జరిగింది. డబ్బుల కోసం వేధిస్తున్నాడని కట్టుకున్న భర్తను కడతేర్చిందో ఇల్లాలు. ఈ ఘటనలో నిందితురాలితో పాటుగా మరో ఐగురుగురిని కరీంనగర్‌ టూటౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కత్తి మౌనిక, సురేశ్‌ 2015లో ప్రేమించి పెళ్లి  చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. సప్తగిరికాలనీలో నివాసముంటున్నారు.

అయితే కొన్నాళ్ల క్రితమే వ్యభిచార కూపంలోకి దిగింది మౌనిక. ఈ క్రమంలో భర్త సురేశ్‌ నిత్యం డబ్బుల కోసం వేధించడంతో విసిగిపోయిన మౌనిక అతన్ని చంపేయాలని డిసైడ్ అయిపోయింది. వ్యభిచారం దగ్గర పరిచయం అయిన ముఠాతో భర్తకు స్కెచ్ వేసింది. అరిగె శ్రీజ, పోతు శివకృష్ణ, దొమ్మాటి అజయ్, నల్ల సంధ్య ఊరాఫ్‌ వేముల రాధ, నల్ల దేవదాస్‌ సాయం కోరింది. వారు ఇచ్చిన సూచనల మేరకు ఒకరోజు వయాగ్రా మాత్రలు కూరలో కలిపి చంపాలని ప్రయత్నించింది.

ముఠాతో కలిసి మరో స్కెచ్

అయితే కూర వాసన రావడంతో సురేశ్‌ దానిని తినలేదు. దీంతో ముఠాతో కలిసి మరో స్కెచ్ వేసింది మౌనిక.  ప్లాన్ బీలో భాగంగా 2025 సెప్టెంబర్17న సురేశ్‌ మద్యం సేవిస్తూ ఉండగా అందులో బీపీ, నిద్ర మాత్రలను పొడిగాచేసి అందులో కలిపింది. దీంతో అది తాగిన సురేశ్‌ అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. ఇదే సరైన టైమ్ అని భావించిన మౌనిక .. సురేశ్‌ మెడకు చీరను బిగించి, కిటికి గ్రిల్‌కు వేలాడదీసి ఉరేసి చంపేసింది.

వెంటనే తన అత్తమామలను పిలిచి..  శృంగారం చేస్తుండగా సురేష్ స్పృహ కోల్పోయాడని తన అత్తమామలకు చెప్పింది. వారు వెంటనే సురేష్ ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే సురేశ్‌ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే- మౌనిక ప్రవర్తనపై పోలీసులకు ముందునుంచే అనుమానం రావడంతో ఆమె కదలికలపై ఫోకస్ పెట్టారు.లోతుగా దర్యాప్తు చేయగా మౌనిక అసలు నిజాన్ని బయటపెట్టింది. తానే అరిగెశ్రీజ, పోతు శివకృష్ణ, దొమ్మాటి ఆజయ్, వేముల రాధ, నల్ల దేవదాస్‌ సాయంతో చంపేశానని  ఒప్పుకుంది. నిందితులను టూటౌన్‌ పోలీసులు అరెస్టు చేసి, గురువారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Advertisment
తాజా కథనాలు