/rtv/media/media_files/2025/10/16/mumbai-businessman-loses-58-crores-in-digital-arrest-fraud-2025-10-16-16-26-27.jpg)
Mumbai businessman loses 58 crores in digital arrest fraud
డిజిటల్ అరెస్టు పేరుతో జరుగుతున్న మోసాలు పేట్రేగిపోతున్నాయి. అమాయకులకు వల వేస్తున్న కేటుగాళ్లు వేలు, లక్షలు, కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. తాజాగా మరో భారీ డిజిటల్ అరెస్ట్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఓ వ్యాపారి నుంచి సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.58 కోట్ల వరకు దండుకున్నారు. ముంబయిలో ఈ అతిపెద్ద స్కామ్ జరిగింది. వ్యక్తిగత డిజిటల్ అరెస్టు కేసుల్లో అతిపెద్ద సైబర్ మోసాల్లో ఇదొకటని పోలీసులు తెలిపారు.
Also Read: సాయుధపోరుకు ముగింపు...లొంగుబాటలో మావోయిస్టులు
ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన మహారాష్ట్ర సైబర్ విభాగం ముగ్గురు నిందితులను అరెస్టు చేసింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల కొందరు సైబర్ నేరగాళ్లు సీబీఐ, ఈడీ అధికారులుగా నటిస్తూ ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్త(72)కు కాల్ చేశారు. మనీలాండరింగ్ కేసులో అతడి పేరు వచ్చినట్లు బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ వ్యాపారవేత్త దంపతులను డిజిటల్ అరెస్టు పేరుతో భయపెట్టారు. డబ్బులు పంపిణీ చేయాలంటూ కొన్ని బ్యాంకు ఖాతాలు పంపించారు.
Also Read: యో చూసుకోబడ్లా.. లైవ్‌లో మహిళకు లాయర్ ముద్దులు - కోర్టు మొత్తం షాక్
ఆ వ్యాపారవేత్త రెండు నెలల వ్యవధిలోనే ఏకంగా రూ.58 కోట్లు బదిలీ చేశాడు. ఆ తర్వాత తాను మోసపోయానని సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం 18 బ్యాంకు ఖాతాలకు ఆ డబ్బులు బదిలీ అయినట్లు గుర్తించారు. సంబంధిత అకౌంట్లను వెంటనే నిలిపివేయాలంటూ అధికారులకు చెప్పారు. అలాగే ఈ కేసులో నిందితులైన అబ్దుల్ ఖుల్లి, అర్జున్ కాడ్వాసార, అతడి సోదరుడు జేఠారామ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. మంటల్లో చిక్కుకుని నలుగురు సజీవ దహనం (వీడియో)