/rtv/media/media_files/2025/10/17/rape-2025-10-17-14-41-29.jpg)
బెంగళూరులో దారుణం జరిగింది. ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒక జూనియర్ విద్యార్థి తన సీనియర్ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతరం నిందితుడు బాధితురాలికి ఫోన్ చేసి 'నీకు పిల్ కావాలా?' అని అడిగాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు: 21 ఏళ్ల జీవన్ గౌడ అదే కాలేజీలో ఐదో సెమిస్టర్ విద్యార్థి చదువుతున్నాడు, ఏడో సెమిస్టర్ చదువుతున్న బాధితురాలు.. ఇద్దరూ ఒకే డిపార్ట్‌మెంట్‌కు చెందినవారు. వీరికి మూడు నెలల పరిచయం ఉంది. అక్టోబర్ 10న మధ్యాహ్నం 1:30 నుండి 1:50 గంటల మధ్య లంచ్ బ్రేక్ సమయంలో ఈ సంఘటన జరిగింది. లంచ్ బ్రేక్ సమయంలో అతను ఆమెకు చాలాసార్లు ఫోన్ చేసి, ఆర్కిటెక్చర్ బ్లాక్ దగ్గర రమ్మని కోరాడు.
𝐁𝐞𝐧𝐠𝐚𝐥𝐮𝐫𝐮 𝐬𝐭𝐮𝐝𝐞𝐧𝐭 𝐫𝐚𝐩𝐞𝐬 𝐬𝐞𝐧𝐢𝐨𝐫 𝐨𝐧 𝐜𝐨𝐥𝐥𝐞𝐠𝐞 𝐜𝐚𝐦𝐩𝐮𝐬, 𝐥𝐚𝐭𝐞𝐫 𝐚𝐬𝐤𝐬 𝐢𝐟 𝐬𝐡𝐞 𝐧𝐞𝐞𝐝𝐬 𝐩𝐢𝐥𝐥
— IndiaToday (@IndiaToday) October 17, 2025
A Bengaluru junior student allegedly raped his senior inside a private engineering college. The accused, Jeevan Gowda, was arrested and… pic.twitter.com/nrNtOKEtZ1
బలవంతంగా ముద్దు పెట్టుకుని
ఆమె అక్కడకి రాగానే బాధితురాలిని బలవంతంగా ముద్దు పెట్టుకుని, పురుషుల వాష్‌రూమ్‌లోకి లాకెళ్లి, తలుపు లాక్ చేసి, మధ్యాహ్నం 1.30 నుండి 1.50 గంటల మధ్య ఆమెపై అత్యాచారం చేశాడు. ప్రాణాలతో బయటపడిన ఆమె అతని నుంచి తప్పించుకుని తన స్నేహితులకు చెప్పి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. దీంతో అక్టోబర్ 15న అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారం చేసిన తర్వాత నిందితుడు జీవన్ గౌడ బాధితురాలికి ఫోన్ చేసి నీకు పిల్స్ కావాలా అని అడిగినట్లుగా ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.
పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, నిందితుడు జీవన్ గౌడను అరెస్ట్ చేశారు. నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు. ఈ కేసుపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాలేజీ క్యాంపస్‌లో ఇలాంటి సంఘటన జరగడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక మరో ఘటనలో ఒక కళాశాల విద్యార్థినిపై 10 రోజుల క్రితం పేయింగ్ గెస్ట్ అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Follow Us